1st Time Tricolour Hoisted : ఈసారి స్వాతంత్య్ర దినోత్సవం(ఆగస్టు 15) మన దేశంలోని 13 గ్రామాలకు వెరీ స్పెషల్. ఎందుకంటే ఆ పల్లెల్లో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉండే 13 గ్రామాల్లో తొలిసారి మన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అక్కడి ప్రజలు సగర్వంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దేశ స్వాతంత్య్ర వేడుకలను సెలబ్రేట్ చేసుకునే గొప్ప అవకాశాన్ని అందుకున్న ఆ ఛత్తీస్‌గఢ్ పల్లెల జాబితాలో.. నెర్‌ఘాట్ (దంతెవాడ జిల్లా), పానిదోబిర్ (కంకేర్), గుండం, పుట్‌కేల్, చుత్వాహి (బీజాపూర్), కస్తూర్‌మెట్ట, మస్పూర్, ఇరాక్‌భట్టి, మొహంది (నారాయణపూర్), టేకలగూడెం, పువర్తి, లఖపాల్, పూలన్‌పాడ్ (సుక్మా) ఉన్నాయి. ఆ పల్లెల్లో తొలిసారిగా త్రివర్ణ పతాకం ఎగురవేశామని బస్తర్ రీజియన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్‌రాజ్ వెల్లడించారు.
Also Read :AI Dance : ఏఐ డ్యాన్స్‌తో దుమ్మురేపిన ట్రంప్, మస్క్.. 7 కోట్ల వ్యూస్
ఈ పల్లెల్లో శాంతి నెలకొనడానికి ప్రధాన కారణం పోలీసులు, భద్రతా బలగాలు. వారు గతేడాది నుంచే ఛత్తీస్‌గఢ్‌లోని అన్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల్లో మావోయిస్టుల యాక్టివిటీ లేకుండా ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు. దాని ఫలితంగానే ఈఏడాది తొలిసారిగా 13 పల్లెలు దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోగలిగాయి. అక్కడ శాంతిభద్రతల గాడినపడటం వల్లే ఇది సాధ్యమైంది. పోలీసులు, భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన క్యాంపుల వల్ల ఆయా ప్రాంతాల ప్రజలకు మావోయిస్టుల భయం పోయింది. ఫలితంగా వారు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు ముందుకొస్తున్నారు.
Also Read :Upasana : ఇంత ఘోరాన్ని చూస్తూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకోగలం ? : ఉపాసన
విద్యార్థిని కడతేర్చిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఆగడాలు కొనసాగుతున్నాయి. సుక్మా జిల్లా పువర్తీ గ్రామంలో సోయం శంకర్ అనే 16 ఏళ్ల విద్యార్థిని మంగళవారం రాత్రి మావోయిస్టులు కొట్టి చంపినట్లు తెలుస్తోంది. అతడిని పోలీసు ఇన్‌ఫార్మర్‌గా భావించి మావోయిస్టులు ఈ దాడి చేసినట్లు సమాచారం. దంతెవాడ జిల్లాలోని పల్నర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న శంకర్ ఇటీవలే తన ఊరికి వచ్చాడు. కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించడంతో అతడు గ్రామానికి రాగా మావోయిస్టులు దారుణంగా కడతేర్చారు.