Site icon HashtagU Telugu

FM Nirmala Sitharaman Budget Saree : బడ్జెట్ రోజున ప్రత్యేకమైన చీర తో నిర్మలా సీతారామన్

Minister Nirmala Sitharaman

Minister Nirmala Sitharaman

 

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ (Budget 2024) ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ మధ్యంతర బడ్జెట్‌ ఫై సామాన్య ప్రజలు కోటి ఆశలతో ఉన్నారు. కాగా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటికే ఆమె ఐదు పూర్తి స్థాయి బడ్జెట్లు ప్రవేశ పెట్టగా..ఈరోజు ( ఫిబ్రవరి 1న ) ఆరో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.

కాగా బడ్జెట్ సందర్బంగా ఆమె ఎంతో ప్రత్యేకమైన చీర (Saree ) కట్టుకొని వచ్చి ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఆమె కట్టుకునే చీరలు బడ్జెట్​ను ఏదోరకంగా ప్రతిబింబించేవిగానే ఉన్నాయి. ఈరోజు ఆమె ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కూడా ఆమె ప్రత్యేకమైన చీరనే కట్టుకుని వచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇండిగో బ్లూ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్​లో ఉన్న చీరను నిర్మలా సీతారామన్ కట్టుకువచ్చారు. ఈసారి జామ్దానికి చెందిన చీరను కట్టుకువచ్చినట్లు కనిపిస్తుంది. ఈ చేనేత చీరలకు మూడు వందల ఏళ్లనాటి చరిత్ర ఉంది. ఈ అపురూప కళ బంగ్లాదేశ్​కు చెందినది. ఈ కళలో చీరలపై మొక్కలు, పూలు డిజైన్లు వేశారు. వందశాతం పట్టుతో ఈ చీరలను కళాకారులు తయారు చేస్తారు. ఒక్క చీర నేసేందుకు సుమారు 15 రోజులు సమయం పడుతుంది. ఈరోజు నిర్మలా సీతారామన్ కట్టుకువచ్చిన చీరపై ఆకులు, తీగలతో కూడిన డిజైన్ కనిపిస్తుంది.

గతంలో బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు నిర్మలా కట్టుకున్న చీరలను చూస్తే..2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొలిసారిగా బడ్జెడ్ ప్రవేశ పెట్టారు. అప్పుడు గులాబీ రంగులో బంగారు అంచు ఉన్న మంగళ గిరి చీరను ధరించారు. 2020లో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ.. పసుపు రంగు సిల్క్ చీరను ధరించారు. మూడోసారి 2021లో తెలంగాణకే తలమానికంగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్ చీరను కట్టుకున్నారు. తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీరను తయారు చేశారు. ఎరుపు, హాఫ్ వైట్ సమ్మేళనంతో డిజైన్ చేసిన చీరను ధరించారు. ఈ చీరకు వచ్చిన సన్నని గ్రీన్ బార్డర్​ శారీ అందాన్ని మరింత పెంచింది. 2022లో బడ్జెట్ సమర్పణకు బ్రౌన్ కలర్ చీరను కట్టుకున్నారు . రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ బార్డర్, సిల్వర్ కలర్ డిజైన్​ వచ్చింది. దీనిని ఓడిశాలో తయారు చేశారు. ఇక ఇప్పుడు ఎరుపు రంగు బార్డర్ చీరను ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. మొత్తం మీద ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా..ఈ ఆరుసార్లు ఎంతో ప్రత్యేకమైన చీరలను ధరించి వార్తల్లో నిలిచారు.

Read Also :  Budget 2024: లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌..!