దేవభూమి ఉత్తరాఖండ్‌లో ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఉత్తర కాశీ జిల్లాలో మంగళవారం క్లౌడ్‌బరస్ట్ (Cloud Burst) కారణంగా ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ పెను విపత్తులో 60 మందికిపైగా గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. కుండపోత వర్షానికి ఖీర్ గంగా నది ఉప్పొంగి ప్రవహించడంతో, ఖీర్‌బద్ మరియు థరాలి గ్రామాలు మునిగిపోయాయి. ఈ వరద ధాటికి పలు ఇళ్లు కొట్టుకుపోగా, అనేక నివాసాలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.
ఆకస్మిక వరదల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వరద ప్రవాహం తీవ్రతను చూసి గ్రామస్థులు భయాందోళనతో పరుగులు తీస్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. అరుస్తూ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రజల దయనీయ స్థితి మనసును కలచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ విపత్తు వల్ల సంభవించిన నష్టం భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Diet : బ్రేక్‌ఫాస్ట్‌గా ఇడ్లీ, దోశ తినకూడదా? తింటే ఏమి సమస్యలు వస్తాయి?..దీనిలో నిజమెంతా?
క్లౌడ్‌బరస్ట్ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ మరియు ఆర్మీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీయడానికి, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ బృందాలు ప్రాణాలను రక్షించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. అధికార యంత్రాంగం కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది.
BREAKING: Massive flooding in Khir Ganga in Dharali village of Uttarakhand following incessant heavy rain in the region, many feared trapped#Uttarakhand #UttarakhandRain pic.twitter.com/3j8lkxEOcH
— Vani Mehrotra (@vani_mehrotra) August 5, 2025