First Class Admission : ఆ ఏజ్ నిండితేనే ఫస్ట్‌ క్లాస్‌ అడ్మిషన్‌.. రాష్ట్రాలకు కేంద్రం లెటర్

First Class Admission : స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.  

  • Written By:
  • Updated On - February 27, 2024 / 11:41 AM IST

First Class Admission : స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.  పిల్లలకు ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్‌ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది.  ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర సర్కారు లేఖలు రాసింది. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ) – 2020, రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌  – 2009 అమలులో భాగంగా ఒకటో తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి అని లేఖలో ప్రభుత్వం పేర్కొంది.

We’re now on WhatsApp. Click to Join

వచ్చే విద్యా సంవత్సరం (2024 – 25) నుంచే ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎనిమిదేళ్లలోగా  పిల్లలకు 3 సంవత్సరాల  ప్రీ  స్కూల్‌‌ విద్యతో పాటు 1,2వ తరగతులు పూర్తయితే విద్యాభ్యసన సామర్థ్యాలు చాలా పెరుగుతాయని నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ తెలిపింది. దీనికి అనుగుణంగా తాజా మార్గదర్శకాలను రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం జారీ చేసింది. ప్రస్తుతం  పిల్లలను ఒకటో తరగతిలో చేర్చించే (First Class Admission) వయసు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉందని గతంలో లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్ర సర్కారు చెప్పింది.

Also Read : Zinc Man : బాడీకి జింక్ అందించేందుకు నాణేలు, అయస్కాంతాలను మింగేశాడు.. ఏమైందంటే ?

రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజ్, కేంద్ర ప్రభుత్వం ఒక ఏజ్

6 ఏళ్లు నిండితేనే ఒకటో తరగతిలో అడ్మిషన్ కల్పించే అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.. ఈ ఇష్యూపై విద్యా శాఖ అధికారులతో రేవంత్ సర్కారు ఒక కమిటినీ వేసినట్టు సమాచారం.. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని తెలంగాణ సర్కార్ ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ తరవాత నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. రేపు ఈ అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఈ నిబంధనను సీబీఎస్ఈ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజ్, కేంద్ర ప్రభుత్వం ఒక ఏజ్ పెడితే ఇబ్బందులు వస్తాయని అధికారులు అంటున్నారు.

Also Read : Aadhaar Card:ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనా..?: కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ

Follow us