Site icon HashtagU Telugu

Trump: ట్రంప్ కావాల‌నే భార‌త్‌ను టార్గెట్ చేశారా? నిపుణుల అభిప్రాయం ఇదే!

US Tariffs

US Tariffs

Trump: రష్యా నుండి చమురు, గ్యాస్ దిగుమతులపై అమెరికా భారతదేశంపై 25 శాతం అదనపు సుంకాన్ని విధించడంతో భారతదేశం-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తత మరియు క్షీణత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన అమెరికన్ నిపుణుడు ఫరీద్ జకరియా భారత్-అమెరికా సంబంధాల క్షీణతకు డొనాల్డ్ ట్రంప్‌ (Trump)ను బాధ్యుడిని చేశారు. న్యూఢిల్లీ- వాషింగ్టన్‌ల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ట్రంప్ పూర్వ ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేసిన జాగ్రత్తపూర్వక ప్రయత్నాలను ఆయన పూర్తిగా నాశనం చేశారని జకరియా అన్నారు.

సీఎన్‌ఎన్‌లో తన ప్రోగ్రామ్ సమయంలో జకరియా ఒక విషయం స్ప‌ష్టంగా చెప్పారు. భారతదేశంపై ఇప్పుడున్న అత్యధిక సుంకాన్ని విధించడం, అదే సమయంలో పాకిస్తాన్‌తో తన సంబంధాలను బలోపేతం చేయడం ట్రంప్ 2.0 విదేశాంగ విధానంలో ఇది అతిపెద్ద తప్పిదం అని, ఈ చర్య వల్ల నష్టం ఇప్పటికే జరిగిపోయిందని ఆయన అన్నారు.

Also Read: Brain Power : బ్రెయిన్ పవర్ పెంచుకోవాలనుకుంటున్నారా? ఈ ఫుడ్స్ తప్పక అలవాటు చేసుకోండి

జకరియా మాట్లాడుతూ.. ట్రంప్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకున్నప్పటికీ నష్టం ఇప్పటికే జరిగిపోయింది. ఎందుకంటే అమెరికా తన అసలు ముఖాన్ని చూపించిందని భారతదేశం ఎప్పటికీ మర్చిపోదు. అమెరికా తన మిత్రులతో కూడా కఠినంగా వ్యవహరించడం చాలా నమ్మశక్యం కాని విషయం. ఈ పరిస్థితిలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవాలని, రష్యాకు దగ్గరగా ఉండాలనిచ చైనాతో కూడా తన సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావిస్తుంది అని పేర్కొన్నారు.

ట్రంప్ 2.0 కొత్త విధానానికి భారత్ బాధిత దేశం

భారతదేశం ట్రంప్ 2.0 కొత్త వ్యూహానికి బాధిత దేశ‌మైంది. ఇందులో మిత్రులను అవమానించడం, ప్రత్యర్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం వంటివి ఉన్నాయి. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో సంబంధాలు బలంగా ఉన్నప్పటికీ.. ట్రంప్ రెండవ పదవీకాలంలో భారతదేశం అతని దూకుడు వ్యాఖ్యలు, ఒత్తిడి రాజకీయాలను ఎదుర్కోవలసి వస్తుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలుపై ట్రంప్ తొలుత భారతదేశంపై 25 శాతం అదనపు సుంకం విధించారు. కొన్ని రోజుల తర్వాత ట్రంప్ భారతదేశంపై మరో 25 శాతం అదనపు సుంకం విధించారు. దీంతో ఇప్పుడు భారతదేశంపై అమెరికా విధించిన మొత్తం అదనపు సుంకం 50 శాతానికి పెరిగింది. భారతదేశం-రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యం మాస్కోకు ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి ఆదాయ వనరుగా ఉందని అమెరికా వైట్‌హౌస్ భావిస్తుంది.

Exit mobile version