Exit Polls 2024 : ఇవాళ సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. సర్వత్రా ఉత్కంఠ

ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది.

  • Written By:
  • Updated On - June 1, 2024 / 08:15 AM IST

Exit Polls 2024 :  ప్రస్తుతం తుది విడత ఎన్నికల పోలింగ్ ఘట్టం జరుగుతోంది. ఇవాళ సాయంత్రం పోలింగ్ ప్రక్రియ ముగియగానే పలు మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ నివేదికలను విడుదల చేయనున్నాయి. వాటికోసం దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఏం చెబుతాయో తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌‌ను చూసేందుకు జనం టీవీలు, ఫోన్లు చూస్తూ బిజీగా మారే అవకాశం ఉంది. ఇంతకీ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొచ్చా ? వాటి అంచనాలు కరెక్టేనా ?

We’re now on WhatsApp. Click to Join

కాంగ్రెస్  కీలక నిర్ణయం

ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ సాధిస్తుందా లేక.. దాదాపు 30 పార్టీల కలయికతో ఏర్పడిన ఇండియా కూటమి నెగ్గి అధికారాన్ని దక్కించుకుంటుందా అనేది స్పష్టం కావాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే. అయితే ఈ ఫలితాలపై ఓ అంచనాకు వచ్చేందుకు మాత్రం ఎగ్జిట్ పోల్స్ చాలా కీలకం. ఆ ఎగ్జిట్ పోల్స్ ఇవాళ సాయంత్రం 6.30 గంటల తర్వాత వెల్లడి కానున్నాయి. వీటిపై కాంగ్రెస్  కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన అనంతరం టీవీ ఛానళ్లలో నిర్వహించే డిబేట్లలో పాల్గొనకూడదని ఆ  పార్టీ నిర్ణయించింది.

Also Read :Lok Sabha Polling : తుది విడత పోలింగ్ షురూ.. బారులు తీరిన ఓటర్లు

అంచనాలు తలకిందులు

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు .. వాస్తవ ఎన్నికల ఫలితాలకు దగ్గరగా ఉంటాయని మనం కచ్చితంగా చెప్పలేం. ఇటీవల కాలంలో అవి అంచనాలు తప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. కొద్దినెలల కిందటే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క తెలంగాణ విషయంలో తప్పిస్తే మిగిలిన రాష్ట్రాల విషయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు తప్పాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లపై ఒక్కొక్కరు ఒక్కో అంచనాను వెలువరించాయి. ఛత్తీస్‌గఢ్‌ ఫలితాలపైనైతే అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు దెబ్బతిన్నాయి.

సర్వే ఇలా.. 

ఓటర్లలో కొందరిని సర్వే చేసి.. వారు చెప్పే సమాధానాల ఆధారంగా వెలువరించే రిజల్టే ఎగ్జిట్ పోల్స్. శాస్త్రీయంగా  చెప్పాలంటే దీన్ని సెఫాలజీగా పిలుస్తారు. ఈ లెక్కలు చేసేవారిని సెఫాలజిస్టులు అంటారు. సర్వే చేసే సంస్థ ప్రామాణికత, అది ఎవరి కోసం పని చేస్తోందనే దాని ఆధారంగా దాన్ని నమ్మాల్సి ఉంటుంది.  ఎంత ఎక్కువ మందిని సర్వేచేస్తున్నారనేది ఎంత ముఖ్యమో.. ఎంత భిన్నత్వాన్ని పాటిస్తున్నారు అనేది అంతకంటే ఎక్కువ ముఖ్యం. అంటే వివిధ మతాలు, కులాలు, జెండర్, యువకులు, మహిళలను కూడా సర్వేలో పరిగణించాల్సి ఉంటుంది. 2019 లోక్‌సభ ఎన్నికల టైంలో  అన్ని సర్వే సంస్థలు కూడా బీజేపీయే మళ్లీ గెలుస్తుందని చెప్పాయి. అదే జరిగింది.  2014 లోక్‌సభ ఎన్నికల టైంలో దాదాపు అన్ని ఎగ్జిట్‌ పోల్‌ సంస్థలు ఎన్నికల ఫలితాల్ని సరిగ్గానే అంచనా వేశాయి. ఎన్డీయేకి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని చెప్పాయి.

Also Read : Rohit Sharma Record: అరుదైన రికార్డుకు చేరువ‌లో రోహిత్ శ‌ర్మ‌.. మ‌రో మూడు సిక్స్‌లు కొడితే రికార్డు బ‌ద్ద‌లే..!