Site icon HashtagU Telugu

Insurance : రైతుల కోసం అద్భుతమైన పథకం..ఎరువులు కొంటె రూ.2 లక్షల భీమా

Wonderful Scheme For Farmer

Wonderful Scheme For Farmer

రైతన్న తన పంటను కాలకష్టాలను తట్టుకుని కాపాడుకుంటూ.. ఆఖరికి మంచి దిగుబడి కోసం నిరంతరం శ్రమిస్తాడు. అయితే ఎక్కువ మంది రైతులు ప్రస్తుతం రసాయన ఎరువులపైనే ఆధారపడుతున్నారు. కానీ ఈ ఎరువులు కొనుగోలు చేసే సమయంలో చిన్న తప్పు చేస్తున్నారు. అదే రసీదు తీసుకోవడం చేయకపోవడం. దీని వల్ల వారు అనేక ప్రయోజనాలను కోల్పోతున్నారు. ఇఫ్కో సంస్థ అందిస్తున్న సంకట హరన్ బీమా పథకం కూడా ఈ లిస్టులోనే ఉంది. ఈ పథకం ద్వారా ఎరువులు కొనుగోలు చేసిన రైతుకు ఉచితంగా రూ.2 లక్షల వరకూ బీమా లభిస్తుంది.

ఈ బీమా ప్రీమియం రైతు నుంచి ఏమీ వసూలు చేయదు. కేవలం ఇఫ్కో ఎరువులు లేదా నానో ఉత్పత్తులు కొనుగోలు చేయడం ద్వారా ఈ పథకం లబ్ధి పొందవచ్చు. ఎరువుల బస్తా ఒక్కొక్కటికి రూ.10 వేల బీమా వర్తిస్తుంది. ఉదాహరణకు 20 బస్తాలు లేదా 20 నానో యూరియా సీసాలు తీసుకుంటే మొత్తం రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ బీమా రైతు మృతికి 100%, రెండు అవయవాల నష్టానికి 50%, ఒక అవయవానికి 25% పరిహారం చెల్లిస్తుంది. బీమా చెల్లుబాటు కాలం , కొనుగోలు చేసిన రోజు నుంచి 12 నెలల వరకు ఉంటుంది.

Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్

ఈ బీమా సదుపాయం పొందేందుకు ఎరువులు కొనుగోలు చేసిన రసీదు తప్పనిసరిగా భద్రపర్చాలి. ప్రమాదం జరిగిన పక్షంలో ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం రిపోర్ట్, మరణ ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాలను ఇద్దరు నెలల లోగా ఇఫ్కో కార్యాలయానికి సమర్పించాలి. అనుకోని ప్రమాదాలు రోడ్డు ప్రమాదం, పాముకాటు, వ్యవసాయ యంత్రాల వల్ల గాయాలు, నీటిలో మునిగిపోవడం వంటివన్నీ ఈ బీమా పరిధిలోకి వస్తాయి. ఇది రైతన్నకు గొప్ప భద్రతను కల్పించే వినూత్న పథకంగా నిలుస్తోంది.

ఇలాంటి బీమా పథకాలపై రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ఉన్న సహకార సంఘాలు, రైతు సమితులు దీనిపై ప్రచారం జరిపితేనే రైతన్నలు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగించగలరు. ఈ బీమా పథకంతో పాటు తెలంగాణలో అమలులో ఉన్న రైతు బీమా కూడా కొనసాగుతుండటం వల్ల రైతు కుటుంబాలకు డబుల్ భద్రత లభిస్తుంది. ఎరువులు కొంటే ఉచితంగా లభించే ఈ బీమా పథకం నిజంగా అన్నదాతలకు అండగా నిలుస్తోంది.