Site icon HashtagU Telugu

Congress : మొన్న బిహార్ పార్టీ.. ఇవాళ పంజాబ్ పార్టీ.. కాంగ్రెస్‌లో విలీనం

Congress Election Committee

Congress released another list

Congress :  ఇటీవల బిహార్‌లో ‘జన అధికార పార్టీ’ కాంగ్రెస్‌లో విలీనం కాగా, తాజాగా మరో రాజకీయ పార్టీ కూడా హస్తం పార్టీలో కలిసిపోయింది.  దాని పేరే నవన్ పంజాబ్ పార్టీ. పంజాబ్‌లోని పాటియాలాకు చెందిన ఆప్ మాజీ ఎంపీ,  నవన్ పంజాబ్ పార్టీ అధినేత ధరమ్‌వీర్ గాంధీ సోమవారం కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు పవన్ ఖేరా, పంజాబ్ ఏఐసీసీ ఇన్‌చార్జి దేవేంద్ర యాదవ్, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్, ప్రతాప్ సింగ్ బజ్వాల ఆధ్వర్యంలో ఆయన హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. ధరమ్ వీర్ సింగ్ పాటియాలా నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ స్థానం నుంచి ఆప్ తన అభ్యర్థిని ఖరారు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :No To Diesel Vehicles : 36 కోట్ల వాహనాలను వదిలించుకుంటాం.. కేంద్ర మంత్రి ప్రతిజ్ఞ

జన అధికార పార్టీ చీఫ్ పప్పుయాదవ్ ఇటీవల కాంగ్రెస్‌లో(Congress) చేరారు. బిహార్‌లోని పూర్నియా లోక్‌సభ  టికెట్ హామీతో ఆయన జన అధికార పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రస్తుతం ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు నుంచి పోటీచేయాలని ఆర్జేడీ  నిర్ణయించింది. బీమా భారతిని అభ్యర్థిగా ప్రకటించింది. మరోవైపు పూర్నియా ప్రజల డిమాండ్‌తో ఏప్రిల్ 2న నామినేషన్ దాఖలు చేస్తానని పప్పు యాదవ్ అంటున్నారు. దీంతో బీహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఆర్జేడీ 26, కాంగ్రెస్‌ 9, వామపక్షాలు ఐదు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఆర్జేడీకి కేటాయించిన 26 స్థానాల్లో పూర్నియా లోక్‌సభ స్థానం ఉంది. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించలేదు. వామపక్ష పార్టీలు కూడా ఆర్జేడీకి మద్దతు ప్రకటించిన వేళ మంగళవారం నామినేషన్ దాఖలు చేస్తానని పప్పు యాదవ్ బాంబు పేల్చారు. పూర్నియా నుండి మాత్రమే పోటీ చేస్తానని గతంలో చాలాసార్లు చెప్పానని.. తాను లోకాన్ని విడిచి వెళ్లగలనేమో కానీ పూర్ణియాను విడిచిపెట్టలేనని తెలిపారు. పప్పు యాదవ్ ప్రకటన కూటమిలో చిచ్చు పెట్టినట్లైంది.