Site icon HashtagU Telugu

NEET – Supreme Court : చిన్న నిర్లక్ష్యమున్నా సరిదిద్దాల్సిందే.. ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు

Supreme Court

NEET – Supreme Court : మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)పై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. పరీక్షను నిర్వహిస్తున్న ఏజెన్సీగా న్యాయంగా వ్యవహరించాలని ఎన్‌టీఏను మందలించింది. నీట్‌ అవకతవకలపై, పేపర్ లీక్ వ్యవహారంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.

We’re now on WhatsApp. Click to Join

నీట్ పరీక్ష నిర్వహణలో ఎంత చిన్న  తప్పు జరిగినా..  దాన్ని సరిదిద్దాలని ఎన్‌టీఏకు  సుప్రీంకోర్టు సూచించింది. నీట్ పరీక్ష నిర్వహణలో ఎవరైనా 0.001 శాతం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. దానిపై ఫోకస్ చేసి పూర్తిగా పరిష్కరించాలని ఎన్‌టీఏకు దేశ సర్వోన్నత న్యాయస్థానం హితవు పలికింది.  నీట్ పరీక్ష రాసేందుకు విద్యార్థులు పడే  కష్టాన్ని మర్చిపోకూడదని ఎన్‌టీఏను కోరింది. ‘‘ఎన్‌టీఏ లాంటి వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అవుతాడని అనుకోండి. అప్పుడు అతను సమాజానికి మరింత హాని కలిగిస్తాడు’’ అని సుప్రీంకోర్టు(NEET – Supreme Court) పేర్కొంది.

Also Read : Singer Alka Yagnik: సింగర్ అల్కా యాగ్నిక్‌కు వినికిడి లోపం.. ఏమైందంటే..

నీట్‌ పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వం, ఎన్టీయేకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 8కి వాయిదా వేసింది.మరోవైపు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కూడా విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టును ఎన్టీఏ కోరింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు బెంచ్.. ఆ పిటిషన్‌పైనా జూలై 8న విచారణ జరుపుతామని తెలిపింది. నీట్ పరీక్షల పేపర్ లీక్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ దాఖలైన దాదాపు డజను పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు విచారించనుంది.

Also Read :Safety Car: ఆ విషయంలో తగ్గేదేలే అంటూ ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన టాటా నెక్సాన్?