EOS 09 Mission : భారతదేశ సరిహద్దులు, తీర ప్రాంతాల్లో నిఘా అవసరాలు, భూ పరిశీలన కోసం ఈఓఎస్-09(రీశాట్-1బి) ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తయారు చేసింది. దీన్ని ఈరోజు తెల్లవారుజామున శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ – సీ61 రాకెట్ ద్వారా ప్రయోగించారు. అది తొలుత బాగానే నింగిలోకి దూసుకెళ్లింది. రెండోదశ వరకు ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అయితే మార్గం మధ్యలో మూడోదశ తర్వాత, అకస్మాత్తుగా రాకెట్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదు. ఈవిషయాన్ని స్వయంగా ఇస్రో ఛైర్మన్ నారాయణన్ వెల్లడించారు. సాంకేతిక సమస్యకు సంబంధించిన వివరాలను విశ్లేషించి త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. ఈమేరకు వివరాలతో ఎక్స్ వేదికగా కూడా ఇస్రో ఒక పోస్ట్ పెట్టింది.
Also Read :Nara Lokesh : సరైన టైములో లోకేష్ ను రంగంలోకి దింపబోతున్న టీడీపీ ..?
మూడోదశలో ఏం జరిగిందంటే..
PSLV-C-61 రాకెట్‌తో ప్రయోగం(EOS 09 Mission) అనేది వివిధ దశలను కలిగి ఉంటుంది. భూమి వద్ద PS1, PSOM జ్వలనం నుంచి మొదలుకొని.. నింగిలోకి చేరిన తర్వాత రాకెట్‌లోని వివిధ భాగాలు విడిపోవడం, చివరకు రాకెట్ నుంచి ఉపగ్రహం వేరు కావడం దాకా చాలా దశలు ఉంటాయి. ఇందులోనే మూడోదశ జరుగుతుండగా సమస్య తలెత్తిందని ఇస్రో పేర్కొంది. అందువల్లే ఈ మిషన్‌ను పూర్తి చేయలేకపోయారు. ఇస్రో చీఫ్ ప్రకారం.. ప్రయోగం మూడోదశలో రాకెట్‌లో ఉన్న ఒక మోటారు నుంచి అధిక థ్రస్ట్ విడుదల అవుతుంది. అది భూమి వాతావరణం నుంచి రాకెట్‌ను మరింత పైకి నెడుతుంది. ఈ దశలో రాకెట్ నుంచి గరిష్ఠంగా 240 కిలోన్యూటన్‌ల థ్రస్ట్ విడుదల అవుతుంది. ఈక్రమంలోనే ఏదో లోపం జరిగింది. రాకెట్ నింగిలోకి ఎగిరిన 203వ సెకండ్లో హెచ్టీపీబీ (హైడ్రాక్సైల్ టెర్మినేటెడ్ పాలీబుటాడయీన్) ప్రొపలెంట్ సరిగ్గా పనిచేయలేదని సమాచారం. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ పూర్తిస్థాయిలో విఫలం కావడం (63 లాంచ్‌లలో) ఇది 3వసారి. 2017 సంవత్సరం తర్వాత ఇదే తొలిసారి.
Also Read :Jyoti Malhotra: భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం చేసిన మహిళా యూట్యూబర్!
ఏమిటీ.. ఈఓఎస్-09 ఉపగ్రహం
EOS-09 అనేది C-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ టెక్నాలజీతో కూడిన అధునాతన భూమి పరిశీలన ఉపగ్రహం. ఇది పగలు, రాత్రి అనే తేడా లేకుండా అన్ని వాతావరణ పరిస్థితులలో భూమి ఉపరితలపు హై రిజల్యూషన్ ఫొటోలను తీయగలదు. ఈ సామర్థ్యం లభిస్తే భారత్ చాలా రంగాలలో నిఘా, నిర్వహణ వ్యవస్థలను మోహరించగలదు.ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల కోసం ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేష్ సిందూర్ తర్వాత ఈ తరహా శాటిలైట్ల అవసరం మన దేశానికి పెరిగింది.