Arvind Kejriwal Vs ED : వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతులు మంజూరు చేశారు. దీంతో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి లైన్ క్లియర్ అయింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు తమకు అనుమతులు ఇవ్వాలని డిసెంబరు 5న లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఈడీ(Arvind Kejriwal Vs ED) రిక్వెస్టు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న వీకే సక్సేనా.. విచారణను పర్మిషన్ ఇచ్చారు.
Also Read :Ambani In Pakistan : పాక్‌లోనూ ముకేశ్ అంబానీ దూకుడు.. అత్యధికంగా ‘సెర్చ్’ చేసిన పాకిస్తానీలు
మరోవైపు శుక్రవారం రోజు (డిసెంబరు 20న) ఢిల్లీ హైకోర్టు కూడా కీలక ఆదేశాలిచ్చింది. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటును పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ కేజ్రీవాల్, సిసోడియాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ ఛార్జిషీటులో తమపై తప్పుడు అభియోగాలను నమోదు చేశారని వారిద్దరూ వాదించారు. కేజ్రీవాల్, సిసోడియాలు దాఖలు చేసిన పిటిషన్లకు సమాధానం ఇచ్చేందుకు అదనపు సమయాన్ని కేటాయించాలని ఈడీ చేసిన రిక్వెస్టుకు హైకోర్టు కూడా అంగీకారం తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేసింది. లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన ఈడీ, సీబీఐ కేసులో ప్రస్తుతం సిసోడియా, కేజ్రీవాల్‌లు బెయిల్‌పై బయట ఉన్నారు.
Also Read :Earthquake: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో భూకంపం
‘‘ఢిల్లీ పరిధిలో లిక్కర్ పంపిణీ హక్కులను కొన్ని ప్రైవేటు సంస్థలకు కేజ్రీవాల్, సిసోడియా కట్టబెట్టారు. మద్యంపై వాళ్లకు 12 శాతం ఫిక్స్‌డ్ మార్జిన్‌ను నిర్ణయించారు. ఈమేలు చేసినందుకు ప్రతిగా తమకు 6 శాతం చొప్పున ముడుపులను ఇవ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నారు. లిక్కర్ స్కాం ద్వారా సేకరించిన ముడుపుల డబ్బులను 2022 సంవత్సరంలో పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు పెట్టారు’’ అని ఈడీ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు.