Terrorists Encounter : జమ్మూ కశ్మీరులోని షోపియాన్ జిల్లా షుక్రూ కెల్లర్ ఏరియాలో ముగ్గురు లష్కరే తైబా ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ రోజు ఉదయం భారత భద్రతా బలగాల కాల్పుల్లో తొలుత ఒక లష్కరే తైబా ఉగ్రవాది హతమయ్యాడు. మిగతా ఇద్దరు ఉగ్రవాదులు జనావాసాల మధ్య దాక్కొని, భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులు దాక్కొని ఉన్న ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వారు బయటికి పారిపోకుండా పహారాను పెంచాయి. డ్రోన్ల సాయంతో ఉగ్రవాదుల కచ్చితమైన లొకేషన్‌ను గుర్తించాయి. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు కొనసాగిన తర్వాత.. మిగతా ఇద్దరు ఉగ్రవాదులను కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. మరో లష్కరే ఉగ్రవాది కూడా షుక్రూ కెల్లర్ ఏరియాలో దాక్కొని ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. అందుకే పరిసర ప్రాంతాల్లోని ఇళ్లన్నీ జల్లెడ పడుతున్నాయి. అనుమానాస్పదంగా కనిపించిన వారందరినీ ప్రశ్నిస్తున్నాయి.
Also Read :Death Facts : మనిషి చనిపోయినా.. ఈ అవయవాలు పనిచేస్తాయి తెలుసా ?
సమాచారం అందిన వెంటనే..
షోపియాన్ జిల్లాలోని షుక్రూ కెల్లర్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలకు(Terrorists Encounter) సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతానికి భద్రతా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. దీంతో భద్రతా బలగాలు ప్రతి కాల్పులను ప్రారంభించాయి. ఈక్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. కశ్మీరీ ప్రజలు ఉగ్రవాదం నుంచి విముక్తిని కోరుకుంటున్నారు. అందుకే ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని భద్రతా బలగాలకు అందిస్తున్నారు.
Also Read :Jihadi Attack : బుర్కినా ఫాసోలో ఫ్రాన్స్ వర్సెస్ రష్యా.. ఉగ్రదాడిలో 130 మంది మృతి
‘టెర్రర్ ఫ్రీ కాశ్మీర్’ పోస్టర్లను అంటించిన తర్వాత..
ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదుల ఫొటోలతో ‘టెర్రర్ ఫ్రీ కాశ్మీర్’ పోస్టర్లను భారత భద్రతా బలగాలు తయారు చేయించాయి. వాటిని జమ్మూకశ్మీరులోని చాలా ప్రాంతాల్లో గోడలపై అంటించారు. ఆ ఉగ్రవాదుల గురించి సమాచారం ఇచ్చే వారికి రూ. 20 లక్షల బహుమతి ఇస్తామని సదరు పోస్టర్లలో ప్రస్తావించారు. సమాచారం ఇచ్చే వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ పోస్టర్లను అంటించిన కొన్ని గంటల్లోనే.. షోపియాన్ జిల్లా షుక్రూ కెల్లర్ ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందింది.