Site icon HashtagU Telugu

Starlink In Manipur : మణిపూర్ ఉగ్రవాదుల చేతిలో ‘స్టార్ లింక్’.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదీ

Starlink In Manipur Elon Musk Starlink Satellite Beams India

Starlink In Manipur : ‘స్టార్ లింక్’.. ఇది అమెరికా అపర కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ. ఇటీవలే మణిపూర్‌లో ఉగ్రవాదుల నుంచి ‘స్టార్ లింక్’ లోగోతో కూడిన ఒక డివైజ్ భద్రతా బలగాలకు దొరికింది. ఆ డివైజ్‌తో ఉగ్రవాదులు నేరుగా స్టార్ లింక్ శాటిలైట్ నుంచి ఇంటర్నెట్‌ను పొందేవారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ నిజంగానే మణిపూర్‌లో ఉన్న ఉగ్రవాదులకు ఇలాంటి టెక్నాలజీ చేరితే.. అది ఆందోళన కలిగించే అంశం. దీనిపై భారత ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ టాపిక్‌పై వెంటనే ఎలాన్ మస్క్ స్పందించారు.

Also Read :H 1B Visa Rules : భారతీయ టెక్ నిపుణులకు గుడ్ న్యూస్.. హెచ్‌-1బీ వీసా రూల్స్ సులభతరం

మణిపూర్‌లో యాక్టివిటీ చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు స్టార్ లింక్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ డివైజ్‌లు అందాయనే ప్రచారంలో వాస్తవికత లేనే లేదని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు.  భారతదేశం పరిధిలో స్టార్ లింక్(Starlink In Manipur) శాటిలైట్ సిగ్నల్స్‌ను తాము ప్రస్తుతం ఆఫ్ చేసి ఉంచినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఎన్నడు కూడా భారత్ పరిధిలో స్టార్ లింక్ శాటిలైట్ సిగ్నల్స్‌ను ఆన్ చేయలేదన్నారు. మణిపూర్‌లో ఉన్న ఉగ్రవాదులకు మయన్మార్ నుంచి ఆయుధాలు సప్లై అవుతున్నాయని అంటున్నారు. బహుశా అదే మార్గంలో స్టార్ లింక్ డివైజ్‌లు కూడా సప్లై అయి ఉంటాయని పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని ఎలాన్ మస్క్ ఖండిస్తున్నారు.

Also Read :Honda Nissan Merger : హోండాలో విలీనం కానున్న నిస్సాన్.. ‘ఫాక్స్‌కాన్’ సైతం రంగంలోకి !

డ్రగ్స్ ముఠా వద్ద దొరికిన స్టార్ లింక్ డివైజ్ ?

నవంబరు 25న భారత్‌లోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న సముద్ర జలాల్లో ఏకంగా రూ.32వేల కోట్లు విలువైన మెథాంఫెటమైన్ డ్రగ్స్‌ను భారత కోస్ట్ గార్డ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ క్రమంలో స్మగ్లర్ల వద్ద కూడా స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ డివైజ్ దొరికింది. అప్పట్లో కూడా భారత పోలీసులు స్టార్ లింక్ కంపెనీకి లీగల్ నోటీసులు పంపారు. ఆ డివైజ్‌లను ఎవరు విక్రయించారు ? ఎవరికి విక్రయించారు ? అనే సమాచారాన్ని అందించాలని కోరారు.