E Commerce – Elections : ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఎన్నికల కోలాహలం.. ఎందుకు ?

E Commerce - Elections : ఈ-కామర్స్ వెబ్‌సైట్లు మనదేశంలో బాగానే సక్సెస్ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 04:18 PM IST

E Commerce – Elections : ఈ-కామర్స్ వెబ్‌సైట్లు మనదేశంలో బాగానే సక్సెస్ అయ్యాయి. ఇటీవల కాలంలో వాటికి ఆర్డర్లు కూడా బాగానే వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పుడు ఎన్నికల సీజన్. అందుకే ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఎన్నికల సామగ్రి సేల్స్ జూమ్ అయ్యాయి. ఎన్నికల సామగ్రిని తయారు చేసే ఎంతోమంది ఈ-కామర్స్ సైట్లలో సెల్లర్లుగా మారారు. వారికి ఇప్పుడు రాజకీయ పార్టీల శ్రేణుల నుంచి బాగానే ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ నాయకులు తమ క్యాడర్ కోసం వెరైటీగా ఉండే ఎన్నికల ప్రచార సామగ్రిని ఈకామర్స్ సైట్ల నుంచి తెప్పించుకుంటున్నారు. ఈక్రమంలో ఎంత ధరైనా చెల్లించేందుకు వెనుకాడటం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల నాటితో పోలిస్తే.. ఈసారి ఈకామర్స్ సైట్లలో రాజకీయ పార్టీల సామగ్రికి డిమాండ్ బాగా పెరగడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

రాజకీయ పార్టీల బ్యాడ్జ్‌లు, కండువాలు, లోగోలు, గడియారాలను ఈకామర్స్ సైట్లలో ప్రస్తుతం అమ్ముతున్నారు. బీజేపీ నుంచి బీఎస్పీ దాకా అన్ని పార్టీలకు సంబంధించిన మెటీరియల్స్ వివిధ ఈకామర్స్ సైట్లలో అందుబాటులో ఉంది. ఎలక్షన్‌ థీమ్‌తో వివిధ రకాల వస్తువులు కూడా యూజర్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కొనేలా చేస్తున్నాయి. ఈ-కామర్స్‌ సైట్లలోని(E Commerce – Elections) సెర్చ్‌ బార్‌లో రాజకీయ పార్టీ పేరు ఎంటర్‌ చేస్తే చాలు వాటికి సంబంధించిన జెండాలు, లాకెట్లు, పెన్నులు, కండువాలు అన్నీ డిస్‌ప్లే అవుతున్నాయి.

Also Read : Nara Lokesh : రాసలీలలు ఎక్కడ బయటపడతాయో అనే భయంలో విజయసాయి రెడ్డి – లోకేష్

కొన్ని రాజకీయ పార్టీలైతే ఇలాంటి మెటీరియల్‌ను అమ్మేందుకు సొంతంగా వెబ్‌సైట్లను కూడా మెయింటైన్ చేస్తున్నాయి. ఇటీవలే నమో మర్చండైజ్‌ వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. ఇందులో బీజేపీ, ప్రధాని మోడీతో ముడిపడిన టీ-షర్టులు, పుస్తకాలు, బ్యాడ్జ్‌లు, రిస్ట్‌బ్యాండ్‌లు, కీచైన్లు, స్టిక్కర్లు, టోపీలు, పెన్నులు విక్రయిస్తున్నారు. ‘మోదీ కా పరివార్‌’, ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ మోదీ సర్కార్‌’, ‘మోదీ కీ గ్యారంటీ’.. ఇలా వివిధ రకాల నినాదాలతో ఆయా వస్తువులను తయారు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ లోగోతో కీచైన్‌లు, టీఎంసీ ఏసీ అడాప్టర్‌ నైట్‌ ల్యాంప్‌లు, సీపీఎం బానెట్‌ జెండాలకు ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయని ఈకామర్స్ సెలర్లు చెబుతున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 వరకు ఏడు విడతల్లో జరగనుంది. అప్పటివరకు ఈకామర్స్ సైట్లలో ఎన్నికల సామగ్రి విక్రయించే వారికి ఆర్డర్లు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది.

Also Read :PAN Card: మీ దగ్గర పాన్ కార్డు లేదా.. అయితే ఈ పనులు నిలిచిపోవడం ఖాయం?