Maharashtra CM Suspense : మహారాష్ట్ర తదుపరి సీఎం అంశంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి సీఎం అభ్యర్థిని మహాయుతి కూటమి రేపు (డిసెంబర్ 2 – సోమవారం) నిర్ణయిస్తుందని ఆయన వెల్లడించారు. సీఎం పదవి దక్కకపోవడంతో తాను కలత చెందానంటూ జరుగుతున్న ప్రచారాన్ని షిండే ఖండించారు. మహారాష్ట్రలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల కేటాయింపు విషయంలో మహాయుతి కూటమిలో పొరపొచ్చాలు వచ్చాయనేది అబద్ధమని ఆయన చెప్పారు. అవన్నీ ఊహాగానాలేనని వ్యాఖ్యానించారు. సీఎం ఎంపిక విషయంలో తాను బీజేపీ అగ్ర నాయకత్వానికి బేషరతుగా మద్దతు ఇస్తానని షిండే(Maharashtra CM Suspense) తెలిపారు. వారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మహాయుతి కూటమిలోని మూడు పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయని ఆయన చెప్పారు.
Also Read :EVMs Hacking : ఈవీఎంలను హ్యాక్ చేయగలనన్న వ్యక్తిపై కేసు.. అతడు ఎక్కడ ఉన్నాడంటే ?
‘‘నేను సీఎంగా రెండున్నర ఏళ్ల పాటు సెలవు తీసుకోకుండా పనిచేశాను. అందుకే కొంత అనారోగ్యం పాలయ్యాను. జ్వరం వచ్చింది. గొంతు ఇన్ఫెక్షన్‌తో బాధపడ్డాను. ఆ కారణం వల్లే రెస్ట్ తీసుకునేందుకు సతారాలో ఉన్న మా ఇంటికి వచ్చాను. మా ఊరి ప్రజలను కలిశాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది’’ అని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. ఇక మహారాష్ట్ర నూతన సీఎం ప్రమాణ స్వీకారోత్సవం డిసెంబరు 5న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరగనుంది. ఈవిషయాన్ని బీజేపీ రాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాన్‌కులే కూడా వెల్లడించారు.