Site icon HashtagU Telugu

Egg Price : కోడిగుడ్ల ధరకు రెక్కలు.. దిగొస్తున్న చికెన్

Egg Prices

Up Egg Shortage

Egg Price : కార్తీక మాసం ఎఫెక్టుతో మూడు నెలల క్రితం రూ.300 దాకా పెరిగిన చికెన్ ధర ఇటీవల రూ.170కి తగ్గింది. మరోవైపు కోడిగుడ్డు ధర మాత్రం పెరిగిపోయి రీటైల్‌లో రూ.6.50 నుంచి రూ.7 దాకా పలుకుతోంది. క్రిస్మస్‌, కొత్త సంవత్సర వేడుకలకు కేకుల తయారీ కోసం గుడ్ల వినియోగం గణనీయంగా పెరగడం కూడా వాటి ధరలు పెరగడానికి ప్రధాన కారణం. ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్న జనం గుడ్ల వినియోగాన్ని పెంచడం కూడా వాటి ధర పెరగడానికి మరో కారణం.తెలుగు రాష్ట్రాల్లో హోల్ సేల్‌గా 100 గుడ్లు కొంటే రూ. 580కి ఇస్తున్నారు. ఈ లెక్కన చూసుకున్నా హోల్ సేల్‌లోనే కోడిగుడ్డు ధర దాదాపు ఆరు రూపాయలు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు.. నార్త్ ఇండియా, పశ్చిమ బెంగాల్‌లో సైతం కోడిగుడ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అక్కడ కూడా రేట్లు(Egg Price) పెరిగిపోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

గుడ్డు ధర పెరిగిన నేపథ్యంలో దానికి బదులుగా ఆహారంలో అరటిపండును, యాపిల్ సాస్,  పల్లీపట్టీలను చేర్చుకోవచ్చు. బేకింగ్‌లో గుడ్డుకు బదులుగా ఫ్లాక్ సీడ్స్ (అవిసె గింజలు) వాడుకోవచ్చు. టోఫును  గుడ్డుకు ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. కుకీస్ లో వీటిని వాడుకోవడం వల్ల గుడ్డు వాడని లోటు తెలియదు. ఉడికించిన గుడ్లలో ఎన్నో పోషక పదార్ధాలు ఉంటాయి. ఒక్క గుడ్డులో 7 గ్రాముల ప్రొటీన్, 5 గ్రాముల కొవ్వు, 75 కేలరీలతో పాటు ఐరన్, విటమిన్స్, కొవ్వులు, ఖనిజాలు ఉంటాయి.

Also Read: 5 School Holidays : నెలాఖరులో 5 వరుస సెలవులు.. వచ్చే నెలలో 6 వరుస సెలవులు