Site icon HashtagU Telugu

Money Laundering : సోనియా, రాహుల్ కు ఈడీ భారీ షాక్

Ed Rahul Gandhi, Sonia

Ed Rahul Gandhi, Sonia

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ (Sonia Gandhi and Rahul Gandhi)కి ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన నేషనల్ హెరాల్డ్ కేసులో, వీరి మీద ఉన్న మనీలాండరింగ్ (Money Laundering)ఆరోపణల నేపథ్యంలో వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు గణనీయంగా ఉండటంతో, ఈడీ తాజాగా కీలక చర్యలు తీసుకుంది.

Chebrolu Kiran : తీవ్ర ఇబ్బందుల్లో చేబ్రోలు కిరణ్ ఫ్యామిలీ..ఆదుకోవాలంటూ టీడీపీ నేతల రిక్వెస్ట్

కాంగ్రెస్‌కు చెందిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ (Young Indian Private Limited) అనే సంస్థ, గతంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థను స్వాధీనం చేసుకోవడంలో భారీ ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయని ఈడీ ఆరోపిస్తోంది. ఈ ఒప్పందం ద్వారా రూ.2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులు యంగ్ ఇండియన్ ఆధీనంలోకి వెళ్లాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో సుబ్రమణ్యస్వామి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదయ్యింది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.988 కోట్లకు పైగా విలువైన ఆస్తులను నేరం ద్వారా పొందిన ఆదాయంగా గుర్తించి, గతేడాది ఈడీ ప్రాథమికంగా అటాచ్‌మెంట్ చేసింది. ఇప్పుడు ఈ అటాచ్‌మెంట్‌ను అధికారికంగా ధృవీకరించి, తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసింది. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద రాజకీయ దెబ్బగా మారుతాయని, సోనియా – రాహుల్‌ లీగల్ టీమ్ నుంచి ఎదురుగా ప్రకటనలు రావాల్సి ఉంది.