Loksabha Polls: లోక్‌స‌భ ఎన్నిక‌ల వేళ ఈసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

  Loksabha Polls: లోక్‌స‌భ ఎన్నిక‌ల(Loksabha Polls) నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Central Election Commission)ఈరోజు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నాలుగు రాష్ట్రాల్లో(four states) కొంద‌రు జిల్లా ఎస్పీ(Sp)ల‌ను బ‌దిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్‌(District Magistrate), ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బ‌దిలీ(Transfer) చేస్తూ (Ec) ఆదేశాలు జారీ చేసింది. గుజ‌రాత్‌, పంజాబ్‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ బ‌దిలీలు జ‌రిగాయి. గుజ‌రాత్‌లోని చోటా ఉద‌య్‌పూర్‌, అహ్మాదాబాద్ రూర‌ల్ జిల్లా ఎస్పీలు, పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్‌, […]

Published By: HashtagU Telugu Desk
Ec Transfers Police Chiefs

Ec Transfers Police Chiefs

 

Loksabha Polls: లోక్‌స‌భ ఎన్నిక‌ల(Loksabha Polls) నేప‌థ్యంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘం(Central Election Commission)ఈరోజు మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నాలుగు రాష్ట్రాల్లో(four states) కొంద‌రు జిల్లా ఎస్పీ(Sp)ల‌ను బ‌దిలీ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్‌(District Magistrate), ఎస్పీ హోదాల్లో ఉన్న వారిని బ‌దిలీ(Transfer) చేస్తూ (Ec) ఆదేశాలు జారీ చేసింది. గుజ‌రాత్‌, పంజాబ్‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆ బ‌దిలీలు జ‌రిగాయి. గుజ‌రాత్‌లోని చోటా ఉద‌య్‌పూర్‌, అహ్మాదాబాద్ రూర‌ల్ జిల్లా ఎస్పీలు, పంజాబ్‌లోని ప‌ఠాన్‌కోట్‌, ఫ‌జిల్కా, జ‌లంధ‌ర్ రూర‌ల్‌, మ‌లేర్‌కోట్లా జిల్లా ఎస్ఎస్పీల‌ను బ‌దిలీ చేయ‌నున్నారు.
We’re now on WhatsApp. Click to Join.

ఒడిశాలోని ధేన్‌కెనాల్ జిల్లా మెజిస్ట్రేట్‌, డియోఘ‌ర్‌, క‌ట‌క్ రూర‌ల్ జిల్లా ఎస్పీల బ‌దిలీకి ఆదేశాలు ఇచ్చారు. బెంగాల్‌లోని పూర్వ మిడ్నాపూర్, జార్‌గ్రామ్‌, పూర్వా బ‌ర్ద‌మాన్‌, బీర్బ‌మ్ జిల్లాల‌కు చెందిన జిల్లా మెజిస్ట్రేట్ల‌ను బ‌దిలీ చేయ‌నున్నారు. రాజ‌కీయ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు బంధువులైన పంజాబ్‌లోని బ‌టిండా ఎస్ఎస్పీ, అస్సాంలోని సోనిట్‌పూర్ ఎస్పీని కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేశారు.

read also:Razole Janasena Candidate : రాజోలు జనసేన అభ్యర్థిగా దేవా వరప్రసాద్‌..

 

  Last Updated: 21 Mar 2024, 01:00 PM IST