Priyanka Gandhi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ, ప్రధాని మోదీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ సందర్శనకు సంబంధించి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. అక్టోబర్ 30 సాయంత్రంలోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆమెపై బీజేపీ ఫిర్యాదు చేసిన మేరకు ఈసీ ఈ చర్య తీసుకుంది.
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై మతపరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో నేతలు ఎవరైనా వ్యక్తిని మతం పేరుతోగానీ, వ్యక్తిగతంగా గానీ దూషించడం ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే. ఈ నేపథ్యంలో మోడీ గురించి అవాస్తవాలను ప్రచారం చేశారంటూ బీజేపీ ఆరోపించింది. దీంతో ఈసీ యాక్షన్ తీసుకుంది.
Also Read: Qatar Navy Case: ఖతార్ నుండి నేవీ మాజీ అధికారులను వెనక్కి రప్పించండి