Site icon HashtagU Telugu

Earthquake: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం.. భయంతో పరుగులు

Earthquake In Delhi

Earthquake In Delhi

Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు జమ్మూలో కూడా భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం తీవ్రత 6.2గా నమోదైంది. పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో కూడా భూకంపం సంభవించింది.వివరాలలోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం భూప్రకంపనలు వచ్చాయి. అంతకుముందు ఆప్ఘనిస్థాన్ లో 6.1 తీవ్రతతో గురువారం భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో జమ్మూలో కూడా ప్రకంపనలు వచ్చాయి. సమాచారం ప్రకారం భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌గా గుర్తించబడింది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో భూకంప తీవ్రత 6.2గా అంచనా. భూకంపం 201 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు EMSC తెలిపింది. పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో కూడా భూకంపం సంభవించింది. లాహోర్, ఇస్లామాబాద్, ఖైబర్ పఖ్తున్ఖ్వాలో భూమి కంపించింది. పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు పాకిస్థాన్ వాతావరణ విభాగం (పీఎండీ) శుక్రవారం పోస్ట్ చేసింది. మధ్యాహ్నం 2:20 గంటలకు భూకంపం సంభవించింది. గత ఏడాది అక్టోబర్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ 6 మరియు అంతకంటే ఎక్కువ తీవ్రతతో సంభవించిన భూకంపాలతో రెండుసార్లు వణికిపోయింది.

Also Read: Makara Sankranti 2024: సంక్రాంతి పండుగ రోజు ఎటువంటి పనులు చేయాలి? ఎటువంటి పనులు చేయకూడదో తెలుసా?