Earthquake Today: మనదేశంలో మరోసారి భూకంపం వచ్చింది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున పశ్చిమ బెంగాల్ రాజధాని నగరం కోల్‌కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. ఈవివరాలను నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) ధ్రువీకరించింది. పశ్చిమ బెంగాల్‌కు సమీపంలోని బంగాళాఖాతంలో 91 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించామని వెల్లడించింది. భూకంపాన్ని తాము ఫీలయ్యామని కోల్‌కతా నగరానికి చెందిన పలువురు ప్రజలు తెలిపారు. భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసి వచ్చామన్నారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలేవీ ప్రస్తుతానికి బయటికి రాలేదు. సునామీ హెచ్చరికలేమీ జారీ చేయలేదు. మరోవైపు ఒడిశా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జనవరి 8వ తేదీన టిబెట్, నేపాల్‌లలో భూకంపం(Earthquake Today) వచ్చింది. అప్పుడు కూడా బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Also Read :Fact Check : ‘‘30 కోట్లిచ్చి టికెట్ తెచ్చుకున్నా’’.. ఇవి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి వ్యాఖ్యలేనా ?
ఢిల్లీ కంటే తీవ్ర స్థాయిలో..
మన దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 17న భూకంపం చోటుచేసుకుంది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. తాజాగా ఇవాళ కోల్‌కతాలో వచ్చిన భూకంపం అనేది ఢిల్లీ కంటే తీవ్రమైంది. బంగాళాఖాతంలో భూకంప కేంద్రం ఉండటం అనేది సున్నితమైన అంశం. సముద్రంలో వచ్చే భూకంపం తీవ్రత అత్యధికంగా ఉంటే, అది సునామీకి దారితీసే గండం ఉంటుంది. సునామీ వంటివి వస్తే భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ముప్పు ఉంటుంది.
Also Read :MLC Elections : ఎమ్మెల్సీ ఓటు వేయలేకపోతున్న పవన్..ఎందుకంటే..!!
ఉత్తర అమెరికాలోనూ అలర్ట్
ఉత్తర అమెరికాలోని కేమన్ దీవులు, హోండురాస్ మధ్యనున్న సముద్రంలో గత 24 గంటల్లో రెండు భూకంపాలు సంభవించాయి. కేమన్ ఐలాండ్స్ విపత్తు నిర్వహణ సంస్థ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటివరకైతే సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. కోల్‌కతాలో 5.1 తీవ్రతతో భూకంపం రాగా, కేమన్ దీవులు, హోండురాస్ మధ్యనున్న సముద్రంలో 4.9 తీవ్రతతోనే భూకంపం వచ్చింది. గ్రాండ్ కేమన్ నుంచి 242 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.