Site icon HashtagU Telugu

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం..

Turkey Earthquake

Turkey Earthquake

Earth quake in delhi: దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో బైటకు పరుగులు పెట్టారు. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంపం..5.8 గా నమోదైనట్లు తెలుస్తోంది. పాక్ లో సంభవించిన భూకంపం.. ఢిల్లీ నుంచి చండీగఢ్ వరకు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో భూమి కంపించగానే.. ఒక్కసారిగా జనాలు భయంతో బైటకు పరుగులు పెట్టారు . చాలా సేపటి వరకు కూడా.. అసలు ఏంజరిగిందో కూడా అర్థం కాలేదు. దీంతో పోలీసులు.. సెఫ్టీ ప్రదేశాలకు వెళ్లాలని కూడా పోలీసులు సూచించారు. ‘ఢిల్లీ ప్రజలారా.. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. దయచేసి మీ భవనాల నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లండి. కానీ, భయపడొద్దు. ఎలివేటర్లను ఉపయోగించవద్దు. అత్యవసరమైతే 112కి కాల్ చేయండి’ అని ఢిల్లీ పోలీస్‌ ట్వీట్ చేసింది.

Read Also: Dandruff: చుండ్రు, జుట్లు రాలే స‌మ‌స్య‌ను వ‌దిలించుకోండిలా..!

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై.. 5.8 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ నిర్ధారించినట్లు తెలుస్తోంది. ఈ భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్, చండీగఢ్ పరిసర ప్రాంతాల్లో కూడా సంభవించింది. భూకంపం కారణంగా ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ తీవ్రత .. ఇతర రాష్ట్రాలైన.. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లలో కూడా భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. పాక్ లో భూకంపం..కేంద్రం ఉందని కూడా అధికారులు వెల్లడించారు. పాక్ లోని.. ఇస్లామాబాద్‌, లాహోర్‌లలో కూడా భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Encounter : కథువాలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం