Site icon HashtagU Telugu

Earthquake : మహారాష్ట్రలో భూకంపం.. ఐదు జిల్లాల్లో ప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake : ఇవాళ తెల్లవారుజామున మహారాష్ట్రలోని హింగోలి(Hingoli) జిల్లాలో తీవ్ర భూకంపం సంభవించింది. కలమ్నూరి తాలూకాలోని రామేశ్వర్ తండాలో  ఈరోజు ఉదయం 7.14 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. రిక్టరు స్కేలుపై భూకంప(Earthquake) తీవ్రత 5.0గా నమోదైంది.  ఈవివరాలను హింగోలి జిల్లా అధికారులు కూడా ధ్రువీకరించారు. భూకంపం ప్రభావం పొరుగు జిల్లాలపైనా పడిందని వెల్లడించారు.  ‘‘ఇవాళ ఉదయం 7:14 గంటలకు సంభవించిన భూకంపానికి సంబంధించిన భూకంప కేంద్రం హింగోలి జిల్లా కలమ్నూరి తాలూకాలోని రామేశ్వర్ తండాలో ఉంది. హింగోలి, నాందేడ్, పర్భాని, ఛత్రపతి శంభాజీనగర్ (అన్నీ మరఠ్వాడా ప్రాంతంలో), వాషిమ్ (విదర్భ ప్రాంతంలో) ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణనష్టం, ఆస్తి నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారమూ అందలేదు’’ అని అధికారులు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join

ఈనేపథ్యంలో నాందేడ్ జిల్లా అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. రేకుల ఇళ్ల పైకప్పులపై ఉంచిన రాళ్లను తొలగించుకోవాలని సూచించింది.  భూప్రకంపనల ధాటికి ఆ రాళ్లు దొర్లుతూ వచ్చి ప్రజలపై పడే అవకాశం ఉందని తెలిపాయి.  ఈ ఏడాది మార్చినెలలోనూ హింగోలి జిల్లాలో 4,5, 3.6 తీవ్రతతో భూకంపాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో భూకంప కేంద్రాన్ని హింగోలి జిల్లాలోని కలమ్నూరి తాలూకాలోని జాంబ్ గ్రామంలో గుర్తించారు.

Also Read :IAS Trainee – VIP : ట్రైనీ ఐఏఎస్ వీఐపీ డిమాండ్లు.. రాష్ట్ర సర్కారు యాక్షన్

అసోంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని నదులు ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 17.70 లక్షల మంది వరదలకు ప్రభావితులయ్యారు. వరదల కారణంగా మంగళవారం ఒక్కరోజే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కాచర్‌లో ఇద్దరు మరణించగా.. ధుబ్రి, ధేమాజీ, సౌత్‌ సల్మారా, నాగావ్‌, శివసాగర్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదలతో 3,54,045 జనాభా కలిగిన ధుబ్రి జిల్లా బాగా ప్రభావితం అయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 48,021 మంది బాధితులు 507 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

Also Read :Manchu Lakshmi: ప్రణీత్ పై మంచు లక్ష్మి షాకింగ్ వ్యాఖ్యలు.. న‌డిరోడ్డుపై న‌రకాలి అంటూ కామెంట్స్‌.. వీడియో..!