భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఓటరు జాబితాల్లో మార్పులు మరింత పారదర్శకంగా ఉండేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరు తమ ఓటు తొలగించుకోవాలని దరఖాస్తు చేసినా, వారికి లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ OTPని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే ఓటు తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ విధానం వల్ల తప్పుడు ఫిర్యాదులు, దుర్వినియోగాలు తగ్గుతాయని, నిజమైన ఓటర్లు మాత్రమే మార్పులను చేయగలరని అధికారులు తెలిపారు.
Chapathi: వామ్మో.. చపాతీలు రోజు తింటే అంత డేంజరా.. ఇది తెలిస్తే అస్సలు తినరు?
ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. తమ పార్టీ తరఫున ప్రశ్నించినందుకే ఎన్నికల సంఘం ఈ విధానం తీసుకువచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బీజేపీ నేతల ప్రేరణతో కాంగ్రెస్ ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడుతున్నాయని తాను పలు మార్లు ఆరోపించానని ఆయన గుర్తుచేశారు. అయితే ఈ ఆరోపణలకు ఎలాంటి సంబంధం లేకుండా, ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసి, నిష్పాక్షికతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఈ-వెరిఫికేషన్ విధానం అమలులోకి వస్తే, భవిష్యత్‌లో ఓటరు జాబితాలపై అనవసర వాదనలు, అవిశ్వాసాలు తగ్గే అవకాశం ఉంది. టెక్నాలజీ సహకారంతో ఓటరుల భద్రత, విశ్వసనీయత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సదుపాయాలు లేని ఓటర్లు ఇబ్బంది పడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, ఓటరు హక్కులను రక్షించడంలో ఈ చర్య ఒక ముందడుగుగా నిలుస్తుందని భావిస్తున్నారు.