Operation Sindoor : నాగోర్నో-కారోబాఖ్ యుద్ధ కాలం నాటి ఫార్ములాను భారత్‌పైకి ప్రయోగించాలని.. పాకిస్తాన్‌కు తుర్కియే సైన్యం సలహా ఇచ్చినట్లు తెలిసింది. తుర్కియే చెప్పినట్టే పాకిస్తాన్ చేసింది. అయితే ఆ ఫార్ములాను భారత సైన్యం అనూహ్య ఎత్తుగడతో తిప్పికొట్టింది. ఇంతకీ నాగోర్నో-కారోబాఖ్ యుద్ధ కాలంలో ఏమైంది ? ఆ ఫార్ములాను ఈసారి భారత్‌పై పాకిస్తాన్ ఎలా ప్రయోగించింది ? దీన్ని భారత్ ఎలా చిత్తు చేసింది ? ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :What is Teesta Prahar: ‘తీస్తా ప్రహార్’.. ఏమిటిది ? భారత్, బంగ్లాదేశ్ యుద్ధం జరగబోతోందా ?
నాగోర్నో-కారోబాఖ్ యుద్ధ ఫార్ములా ఏమిటి ?
నాగోర్నో-కారోబాఖ్ యుద్ధం అనేది అర్మేనియా, అజర్‌బైజాన్(Operation Sindoor) దేశాల మధ్య జరిగింది. ఈ యుద్ధం 1988 నుంచి 1994 వరకు కొనసాగింది. నాగోర్నో-కారోబాఖ్ ప్రాంతంపై పట్టు కోసం అజర్ బైజాన్ ప్రయత్నించడంతో ఈ యుద్ధం చోటుచేసుకుంది. వాస్తవానికి నాగోర్నో-కారోబాఖ్ ప్రాంతంలో పెద్దసంఖ్యలో అర్మేనియా జాతీయులు ఉంటారు. అయినా ఆ ప్రాంతాన్ని సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునేందుకు అజర్ బైజాన్ యత్నించింది. ఏఎన్-2 యుద్ధ విమానాలను డ్రోన్లుగా మార్చేసి, అర్మేనియాపైకి అజర్‌బైజన్ తొలుత పంపింది. వాటిని వెంటే అర్మేనియా గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. సరిగ్గా ఇదే సమయంలో అర్మేనియా గగనతల రక్షణ వ్యవస్థల స్థావరాలను గుర్తించి, వాటిని అజర్‌బైజన్ దళాలు ధ్వంసం చేశాయి. దీంతో అర్మేనియా గగనతలానికి రక్షణ లేకుండాపోయింది. వెనువెంటనే అజర్‌బైజాన్ డ్రోన్లు అర్మేనియాలోకి చొరబడి విధ్వంసాన్ని క్రియేట్ చేశాయి. అప్పట్లో ఈ ప్లాన్‌ను అజర్ బైజాన్‌కు తుర్కియే దేశమే ఇచ్చిది.
పాకిస్తాన్ ఏం చేసిందంటే.. ?
ఈసారి నాగోర్నో-కారోబాఖ్ తరహా యుద్ధ ఫార్ములాను భారత్‌పైకి ప్రయోగించాలని చూసి పాకిస్తాన్ ఫెయిలైంది. భారత్ వేసిన పాచిక ముందు.. పాక్ పాచిక నిలువలేకపోయింది. మే 6, 7 తేదీల్లో భారత్‌పైకి వందలాది డ్రోన్లను తుర్కియే పంపింది. భారత్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల లొకేషన్లను గుర్తించేందుకు యత్నించింది. అయితే భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని కూల్చి, పాక్ వ్యూహాన్ని చిత్తు చేశాయి.
Also Read :Hitchhiking : రెచ్చిపోతున్న కిలేడీలు.. లిఫ్ట్ ఇస్తే అంతే సంగతి !!
భారత్ ఇలా చిత్తు చేసింది ?
పాకిస్తాన్ ఆర్మీని బోల్తా కొట్టించేందుకు మే 10న తెల్లవారుజామున భారత్ సైతం నాగోర్నో-కారోబాఖ్ యుద్ధ ఫార్ములానే అమలు చేసింది. అచ్చం యుద్ధ విమానాల్లా ఉండే కొన్ని డ్రోన్లను పాకిస్తాన్‌లోకి పంపింది. భారత ఫైటర్ జెట్లు వచ్చాయి అనుకొని.. పాకిస్తాన్ హెచ్‌క్యూ-9 సహా ఇతర రాడార్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. దీంతో వాటిని మోహరించిన ప్రదేశాలను భారత్ గుర్తించింది. ఆ వెంటనే ఇజ్రాయెల్‌కు చెందిన హరూప్ ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. అవి వెళ్లి పాకిస్తాన్ రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేశాయి. ఇక ఇదే సమయంలో భారత్‌లోని పశ్చిమ, నైరుతీ ఆర్మీ కమాండ్ల నుంచి యుద్ద విమానాలు బ్రహ్మోస్, స్కాల్ప్, క్రిస్టల్ మేజ్, ర్యాపేజ్ వంటి మిస్సైళ్లను ప్రయోగించాయి. అవి పాక్ వైమానిక దళ స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ తమ యుద్ధవిమానాలను సుదూరంలోని ఎయిర్ బేస్‌లకు తీసుకెళ్లి దాచింది. ఈ దాడికి భారత్ దాదాపు 15 బ్రహ్మోస్ క్షిపణులను వాడింది. మొత్తం మీద పాక్‌కు ఉన్న 12 అత్యంత కీలక ఎయిర్ బేసుల్లో 11ను భారత్ దెబ్బతీసింది.