Site icon HashtagU Telugu

Iranian Boat: భారత్ లో ఇరాన్ పడవ కలకలం.. రూ. 425 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

Iranian Boat

Resizeimagesize (1280 X 720) 11zon

గుజరాత్ రాష్ట్ర తీరంలో ఇరాన్ పడవ (Iranian Boat) కలకలం సృష్టించింది. భారతదేశ తీర జలాల్లో పాకిస్తాన్ బోటు కనిపించగా దాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్ అదుపులోకి తీసుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్‌తో జాయింట్ ఆపరేషన్‌లో గుజరాత్ ATS భారీ చర్య తీసుకుంది. PRO డిఫెన్స్ గుజరాత్ ప్రకారం.. ATS, ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది 61 కిలోల మాదక ద్రవ్యాలు (రూ. 425 కోట్లు)తో కూడిన ఇరాన్ పడవను గుజరాత్‌లోని అరేబియా సముద్రంలో భారత భూభాగంలో అడ్డుకున్నారు. తదుపరి విచారణ కోసం పడవను ఓఖాకు తీసుకువస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఓ అధికారి వెల్లడించారు.

మరోవైపు, గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) పంచుకున్న రహస్య సమాచారం ఆధారంగా.. భారత కోస్ట్ గార్డ్ తమ రెండు పెట్రోలింగ్ నౌకలను పెట్రోలింగ్ కోసం మోహరించినట్లు డిఫెన్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటన తెలిపింది. రాత్రి సమయంలో ఓఖా తీరానికి దాదాపు 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో ఓ పడవ అనుమానాస్పదంగా కదులుతున్నట్లు ఆ ప్రకటన తెలిపింది. భారత పెట్రోలింగ్ నౌకలు సవాలు చేయడంతో పడవ తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బోటును వెంబడించి పట్టుకున్నారు. ఈ ఇరాన్ బోటు నుంచి రూ.425 కోట్ల విలువైన 61 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ దాదాపు రూ.425 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

Also Read: Steve Smith: కమిన్స్ దూరం.. 4వ టెస్టుకు కూడా స్మితే కెప్టెన్.. !

ఓఖా తీరానికి 340 కిలోమీటర్ల దూరంలో భారత జలాల్లో రాత్రి పడవ అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించిందని ఓ అధికారి తెలిపారు. ఐసీజీ షిప్‌ల ద్వారా వారిని ఆపమని చెప్పారు. కానీ అవతలి వైపు నుండి హెచ్చరికను పట్టించుకోలేదు. ఇరాన్ సిబ్బంది తప్పించుకోవడానికి ప్రయత్నించారని అధికారి పేర్కొన్నారు. అధికారి ప్రకారం.. పడవలో ఇరాన్ పౌరసత్వం ఉన్న ఇరాన్ పౌరులు ఉన్నారు. సిబ్బందితో పాటు పడవను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులను ఓఖాకు తరలించారు.