Drones : పశ్చిమబెంగాల్ రాజధాని నగరం కోల్‌కతా నుంచి ఒక బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. గత కొన్ని రోజులుగా రాత్రి టైంలో కోల్‌కతా నగరం పరిధిలో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు చక్కర్లు కొడుతున్నాయట. కోల్‌కతా పరిధిలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు తదితర ఏరియాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించాయని పోలీసులు తెలిపారు.
Also Read :Congress : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు
మహేస్థల వైపు నుంచి వచ్చాయి
ఈ డ్రోన్లను పోలిన వస్తువుల కదలికలను తొలుత హేస్టింగ్ పోలీసుస్టేషన్ పోలీసులు గుర్తించారు.బెంగాల్‌లోని దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఈ ఎగిరే వస్తువులు(Drones) వచ్చాయని అంటున్నారు. బెంగాల్ రాష్ట్రానికి చెందిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్, కోల్‌కతా డిటెక్టివ్ విభాగాలు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టాయి. ఈ డ్రోన్లు ఎవరికి సంబంధించినవి? వీటితో ఎవరైనా గూఢచర్యానికి పాల్పడుతున్నారా? అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.
Also Read :Google Meet : గూగుల్ మీట్‌లో వీడియో కాల్స్ చేస్తారా ? మీ కోసమే సూపర్ ఫీచర్
రక్షణ శాఖ అధికారుల స్పందన
దీనిపై తమకు కూడా నివేదిక అందిందని, దర్యాప్తు మొదలుపెట్టామని భారత రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. దీనిపై నివేదిక సమర్పించాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర సర్కారు కోరింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు కోల్‌కతాలో కలకలం రేపుతోంది. నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.