Site icon HashtagU Telugu

Driving License : నేటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్

Driving License

Driving License

Driving License : డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్ నేటి (జూన్​ 1) నుంచి అమల్లోకి వచ్చేశాయి.  వీటి ప్రకారం.. ఇకపై మనం లైసెన్సు కోసం ఆర్‌టీఓ ఆఫీసుకు వెళ్లి టెస్ట్ డ్రైవ్​ చేయాల్సిన అవసరం ఉండదు. డ్రైవింగ్ ట్రైనింగ్ నిబంధనల్లో కూడా మార్పులు వచ్చాయి. వివరాలివీ..

We’re now on WhatsApp. Click to Join

ఫీజుల వివరాలివీ.. 

ఇకపై మనం డ్రైవింగ్​ టెస్ట్ (Driving License)​ కోసం ఆర్​టీఓ ఆఫీసుకు బదులుగా ప్రైవేట్ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్లొచ్చు. వాళ్లు డ్రైవింగ్ టెస్ట్​ నిర్వహించి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని తీసుకెళ్లి ఆర్​టీఓ ఆఫీస్‌లో సమర్పించి డ్రైవింగ్ లైసెన్సును ​ పొందొచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియ పూర్తిగా ఆన్​లైన్​లోనే జరుగుతుంది. ఇందుకోసం https://parivahan.gov.in. వెబ్​ పోర్టల్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.  ఫీజుల విషయానికి వస్తే.. లెర్నర్ లైసెన్స్ – రూ.200, లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ – రూ.200, ఇంటర్నేషనల్ లైసెన్స్ – రూ.1000, పర్మినెంట్ లైసెన్స్ – రూ.200, పర్మినెంట్ లైసెన్స్ రెన్యూవల్ – రూ.200, డ్రైవింగ్ స్కూల్ లైసెన్స్ జారీ, రెన్యువల్ – రూ.10,000, డ్రైవింగ్ స్కూల్ డూప్లికేట్ లైసెన్స్  ఫీజు రూ.5000 ఉంటుంది.

Also Read :Salman Khan : సల్మాన్‌ఖాన్ కారుపై కాల్పులకు స్కెచ్.. పాక్ నుంచి తుపాకులు!

వేగంగా నడిపితే అంతే సంగతి

కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా మితిమీరిన వేగంతో బండి నడిపితే రూ.1000 నుంచి రూ.2000 వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు వాహనం నడుపుతూ దొరికితే రూ.25 వేలు జరిమానా విధిస్తారు. ఆ వాహన యజమాని డ్రైవింగ్ రిజిస్ట్రేషన్ కార్డును క్యాన్సిల్ చేస్తారు. పట్టుబడిన మైనర్​కు 25 ఏళ్ల వయస్సు వచ్చేంత వరకు డ్రైవింగ్​ లైసెన్స్ ఇవ్వరు.

Also Read : Israel Vs Gaza : ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణకు అమెరికా ప్రపోజల్.. ఏమిటది ?

డ్రైవింగ్ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తారా ?