Site icon HashtagU Telugu

Namaz : నమాజ్ కోసం నడిరోడ్డుపై బస్సును ఆపిన డ్రైవర్ ..ప్రయాణికులు ఆగ్రహం

Ksrtc Bus Midway For Doing

Ksrtc Bus Midway For Doing

కర్ణాటక (KSRTC Bus) రాష్ట్రంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో ఓ ఆర్టీసీ డ్రైవర్ (Driver) బస్సును రహదారి మధ్యలో నిలిపి, సీటులో కూర్చుని నమాజ్ (Namaz )చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు (Passengers ) ఈ అనూహ్య సంఘటనతో నిస్సహాయంగా వేచి చూడాల్సి వచ్చింది. డ్రైవర్ నమాజ్ ముగిసేవరకు బస్సు నడవకపోవడంతో ప్రయాణికులలో ఆగ్రహం పెరిగింది. కొంతమంది ప్రయాణికులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో, ఇది కాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో సంబంధిత డ్రైవర్‌పై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. డ్రైవర్ విధుల్లో ఉన్న సమయంలో మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విధించిన సర్వీసు నియమాలకు విరుద్ధంగా వ్యవహరించినా, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. దీనితో సంబంధించి ఆర్టీసీ మేనేజ్మెంట్ తక్షణమే సమాచారం సేకరించి విచారణ ప్రారంభించింది.

Caste Census : కుల గణన అంటే ఏమిటి ? ఎవరికి లాభం ?

ఈ ఘటనపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి తీవ్రంగా స్పందించారు. “ప్రతి ఒక్కరికి మతాచరణ హక్కు ఉన్నప్పటికీ, విధి నిర్వహణ సమయంలో ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ప్రవర్తించడం క్షమించదగినది కాదు” అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ విధులపట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. విచారణలో డ్రైవర్ తప్పు చేశాడని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Exit mobile version