Site icon HashtagU Telugu

Pawan Singh: రాబోయే ఎన్నికలలో పోటీ చేయనని ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌!

Pawan Singh

Pawan Singh

Pawan Singh: రాబోయే ఎన్నికలలో పోటీ చేయబోనని నటుడు పవన్ సింగ్ ప్రకటించారు. తాను కేవలం పార్టీలో నిజమైన సైనికుడిగా ఉండాలని కోరుకుంటున్నానని, ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనను ఆయన తన సోషల్ మీడియా ‘X’ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కారణం ఏమిటి?

తాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరింది ఎన్నికల్లో పోటీ చేయడానికి కాదని పవన్ సింగ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. “నేను పవన్ సింగ్, నా భోజ్‌పురి సమాజానికి తెలియజేయాలనుకుంటున్నాను ఏంటంటే.. నేను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలో చేరలేదు. నాకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉద్దేశం లేదు” అని ఆయన అన్నారు. ఈ పోస్ట్‌తో ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాలకు తెరపడింది.

Also Read: Congress: ఢిల్లీకి చేరిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయితీ!?

భార్యతో వివాదం మధ్య ప్రకటన

గత కొద్ది రోజులుగా పవన్ సింగ్ బీజేపీ సీనియర్ నాయకులతో పలుమార్లు సమావేశమవడంతో ఆయన ఈసారి ఎన్నికల బరిలోకి దిగవచ్చని వార్తలు వచ్చాయి. అయితే ఆయన ప్రధానంగా భోజ్‌పురి సినిమా, సంగీతంపై దృష్టి సారించనున్నారని ఇప్పుడు స్పష్టమైంది. ఈ ప్రకటన ఆయన అభిమానులకు కొంత ఊరట కలిగించగా.., రాజకీయ విశ్లేషకులు దీనిని బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగంగా చూస్తున్నారు.

ఇదిలా ఉండగా పవన్ సింగ్ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆయన భార్య జ్యోతి సింగ్‌తో కొనసాగుతున్న వివాదం మీడియాలో నిత్యం చర్చనీయాంశమవుతోంది. జ్యోతి సింగ్.. పవన్ సింగ్‌పై అనేక తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇవి చట్టపరంగా మరియు సామాజికంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం కారణంగా పవన్ సింగ్ ప్రతిష్ఠ, ప్రజా చర్చపై ప్రభావం పడుతోంది.

Exit mobile version