Site icon HashtagU Telugu

101 KG Gold : రామయ్యకు 101 కిలోల బంగారం.. విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా?

Ram Lalla Darshan

Ram Lalla Darshan

101 KG Gold : అయోధ్య రామమందిరానికి అత్యధిక విరాళం ఇచ్చిందెవరో తెలుసా ? ఈవిషయంలో సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్‌వి లాఖి మెుదటి స్థానంలో ఉన్నారు. ఆయన దాదాపు 101 కిలోల బంగారాన్ని అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.68 వేలుగా ఉంది. ఈ లెక్కన దిలీప్ కుటుంబం రామమందిరానికి రూ.68 కోట్లు కానుకగా ఇచ్చినట్టు అవుతుంది. దేశవ్యాప్తంగా 12 కోట్ల కుటుంబాల నుంచి 2 వేల కోట్ల రూపాయలకుపైగా విరాళాలను సేకరించామని విశ్వహిందూ పరిషత్‌ చెబుతోంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపూ 11 కోట్ల రూపాయలను రామ మందిరానికి విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి గోవింద భాయ్‌ ఢోలాకియా 11 కోట్లు విరాళమిచ్చారు. అమెరికా, కెనడా, బ్రిటన్‌లో నివసిస్తున్న రామ భక్తులు కలిసి 8 కోట్ల రూపాయల విరాళాలను సమకూర్చారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మందిరం కోసం కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకుని ఏకంగా తన 16 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. పొలాన్ని అమ్మేయగా ఇంకా 15 లక్షలు తక్కువ కావటంతో.. ఆ మొత్తాన్ని అప్పుగా తెచ్చి మరీ కోటి రూపాయలు విరాళంగా(101 KG Gold) ఇచ్చినట్లు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠతో యావత్ భారతావని పులకించింది. ఈ సందర్భంగా దేశ విదేశాల్లోని భారతీయులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెక్సికోలోని క్వెరెటారో నగరంలో ప్రవాస భారతీయులు తొలి రామమందిరాన్ని నిర్మించారు. భారత్‌ నుంచి తీసుకొచ్చిన సీతా సమేత శ్రీరాముడి విగ్రహాలను వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రతిష్ఠించారు. ఈ క్రతువుకు అమెరికన్ పూజారిగా వ్యవహరించాడని భారత రాయబార కార్యాలయం తెలిపింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు/వీడియోలను షేర్‌ చేసింది.

Also Read: VK Naresh : మహేష్ మీద ఈగ వాలనివ్వను.. బ్రదర్ గా నేనెప్పుడూ తోడుంటా..!

‘‘మెక్సికోలోని క్వెరెటారో నగరంలో శ్రీరాముడి, హనుమంతుడి ఆలయాలను భారతీయులు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో పాటు మెక్సికన్‌ అతిథులు ఆలపించిన భక్తి గీతాలతో ఆలయం దైవిక శక్తితో ప్రతిధ్వనించింది’’ అని రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శనివారం మెక్సికోలోని భారతీయులు భక్తి గీతాలు, భజనలు ఆలపించినట్లు తెలిపింది. రామాయణ గాథను వివరించే నృత్యరూపకాలు ప్రదర్శించడంతోపాటు, ‘లోక్‌ మే రామ్‌’ పేరుతో ప్రత్యేకంగా ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

Also Read: Mushroom Benefits: పుట్టగొడుగులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!