Dogbite: కుక్క కరిస్తే రూ. 20 వేలు పరిహారం.. తీర్పు ఇచ్చిన కోర్టు..!

గత కొన్ని నెలలుగా కుక్కలు కరిచిన (Dogbite) ఘటనలపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 15, 2023 / 09:58 AM IST

Dogbite: గత కొన్ని నెలలుగా కుక్కలు కరిచిన (Dogbite) ఘటనలపై పలు వివాదాలు చెలరేగుతున్నాయి. హౌసింగ్ సొసైటీలో కుక్కల విషయంలో చాలా గొడవలు జరిగాయి. అలాంటి కేసు ఒకటి హైకోర్టుకు చేరింది. ఈ కేసును విచారించిన పంజాబ్, హర్యానా హైకోర్టు కుక్కకాటు కారణంగా గాయపడిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది. ఒక్కో పంటి గుర్తుకు కనీసం రూ.10 వేలు, లోతైన గాయం అయితే ఒక్కో గాయానికి రూ.20 వేలు పరిహారం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఇందుకోసం మార్గదర్శకాలు సిద్ధం చేయాలని, ప్రస్తుతానికి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కుక్కకాటు కేసుల్లో గాయపడిన బాధితులకు ఒక్కో కుక్క పంటి గుర్తుకు కనీసం రూ.10,000 పరిహారం ఇవ్వాలని పంజాబ్, హర్యానా హైకోర్టుకు చెందిన జస్టిస్ వినోద్ ఎస్ భరద్వాజ్ ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో కుక్కకాటు వల్ల గాయమై కండ బయటకు వస్తే 0.2 సెంటీమీటర్ల గాయానికి కనీసం రూ.20 వేలు జరిమానా విధించాలని పేర్కొంది.

Also Read: Vitamins: ఇలా చేస్తే ఆరోగ్యానికి హానికరం..!

నిబంధనలను రూపొందించాలని హైకోర్టు ఆదేశాలు

కుక్కకాటుపై దాఖలైన 193 పిటిషన్లను విచారించిన అనంతరం హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కుక్కకాటు ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసేందుకు కమిటీలు వేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో పాటు ఈ విషయాలను ప్రాధాన్యతతో తీసుకొని దానికి సంబంధించిన నియమాలను కూడా రూపొందించండని తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join.

గత కొన్ని సంవత్సరాలుగా కుక్క కాటు సంఘటనలు వేగంగా పెరిగాయి. పంజాబ్ ఆరోగ్య శాఖ ప్రకారం.. గత ఐదేళ్లలో 6,50,904 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,65,119 మంది గాయపడ్డారు. అయితే చండీగఢ్‌లో కుక్కకాటు 70 శాతం తగ్గింది. అదే సమయంలో హర్యానా డేటా ప్రకారం, ఒక దశాబ్దంలో 11 లక్షలకు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి.