Shocking : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో ఒక విచిత్రమైన, విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన పెంపుడు కుక్క మొరిగిందన్న కోపంతో ఒక వ్యక్తి దాని యజమానిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ దాడిలో 25 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మరణించగా, అతన్ని
కాపాడటానికి ప్రయత్నించిన అతని బాబాయి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఘటన ఫిట్టింగ్‌పరా గ్రామంలో జరిగింది. మృతుడు సుజిత్ ఖల్ఖో రాత్రి 8:30 గంటల ప్రాంతంలో బంధువుల ఇంటి నుంచి భోజనం చేసి తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. పదునైన గొడ్డలితో పదేపదే కొట్టడంతో సుజిత్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు. అతన్ని రక్షించడానికి ప్రయత్నించిన అతని బాబాయి సురేష్ మింజ్‌పై కూడా దుండగులు దాడి చేశారు.
PM Modi : ఏడేళ్ల తర్వాత బీజింగ్‌లో అడుగు పెట్టిన మోడీ..భారత్, చైనా సంబంధాలు పునరుద్ధరణ!
ఈ గొడవకు కారణం సుజిత్ పెంపుడు కుక్క. సుజిత్ తన కుక్కతో కలిసి వెళ్తుండగా, నిందితుడిని చూసి అది మొరగడం మొదలుపెట్టింది. దీనితో ఆగ్రహించిన నిందితుడు సుజిత్‌తో గొడవకు దిగాడు. ఈ గొడవ కాస్తా తిట్లు, బెదిరింపులకు దారితీసి చివరికి హత్యకు కారణమైంది. ఈ దాడి వెనుక కుక్క మొరగడంతో పాటు, బాధితుడితో దాడి చేసినవారికి గతంలో ఉన్న పాత కక్షలు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
దాడి అనంతరం, పోలీసులు సుజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్లు సహా ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయ్‌గఢ్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దివ్యాంగ్ పటేల్ ఈ అరెస్ట్‌లను ధృవీకరించారు. ప్రాథమిక విచారణలో కుక్క మొరిగిన వివాదంతో పాటు, పాత వైషమ్యాలు కూడా ఈ హత్యకు ప్రధాన కారణాలని తేలింది. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుగుతోంది.
TG Assembly Session : ప్రజల సమస్యలు తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు – హరీష్ రావు