Diwali – Walt Disney : తొలిసారిగా అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా దాదాపు 400 మంది నృత్యకారులు ఒకచోట చేరి సంగీతానికి అనుగుణంగా భారత సంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. అందరితో వహ్వా అనిపించారు. జాష్న్ ప్రొడక్షన్స్ వ్యవస్థాపకురాలు, సౌత్ ఏషియన్ అమెరికన్ డ్యాన్సర్ జీనీ బెరీ ఆధ్వర్యంలో ఈ డ్యాన్స్ ఫెస్ట్ జరిగింది. డిస్నీ యొక్క యానిమల్ కింగ్‌డమ్ థీమ్ పార్క్ వేదికగా మూడు రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ జరిగాయి. ది మోస్ట్ మ్యాజికల్ ప్లేస్ ఆన్ ఎర్త్‌గా పేరొందిన వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్‌లో దీపావళి వేడుకలను నిర్వహించడం సంతోషకరంగా ఉందని జీనీ బెరీ అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమానికి 1,000 మంది అతిథులు హాజరయ్యారు. వారి పిల్లలు కూడా కళాకారులతో కలిసి ఆడిపాడారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌ను ఐకానిక్ క్యారెక్టర్‌లు మిక్కీ మౌస్, మిన్నీ మౌస్‌లు.. డ్యాన్సింగ్ నైపుణ్యం కలిగిన పిల్లలతో కలిసి ప్రారంభించాయి. కాలిఫోర్నియాకు చెందిన N-Lorem ఫౌండేషన్ కులమతాలకు తావు లేకుండా అన్ని వర్గాలకు చెందిన దివ్యాంగ బాలలను ఈ ప్రోగ్రాంకు తీసుకొచ్చింది. దివ్యాంగ బాలలను ఈ ప్రోగ్రాంకు తీసుకొచ్చేందుకు తమకు జాష్న్ ప్రొడక్షన్స్ ఫ్రీ పాస్‌లు ఇచ్చిందని N-Lorem ఫౌండేషన్ వెల్లడించింది. ఈ ప్రోగ్రాం సందర్భంగా N-Lorem ఫౌండేషన్‌కు జాష్న్ ప్రొడక్షన్స్ రూ.9 లక్షల విరాళాన్ని(Diwali – Walt Disney) అందించింది.