బీజేపీ నేత, మాజీ రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఒడిశా రైలు ప్రమాద ఘటనపై(Odisha Trains Crash) సంచలన వ్యాఖ్యలు చేశారు. “అది మామూలు రైలు ప్రమాదం కానే కాదు.. విధ్వంస కుట్ర వల్లే ఆ మూడు ట్రైన్స్ క్రాష్(Odisha Trains Crash) అయ్యాయని నేను 100 శాతం కంటే ఎక్కువ గ్యారంటీతో చెప్పగలను” అని ఆయన కామెంట్ చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దినేష్ త్రివేది ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. “ఈ రైలు ప్రమాదం వెనుక విధ్వంస కుట్ర ఉందనే అంశాన్ని మనం తోసిపుచ్చలేం” అని అన్నారు. గతంలో రైల్వే మంత్రిగా పనిచేసిన తనకు ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ పై అవగాహన ఉందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ఉండగా మెయిన్ ట్రాక్ లో వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్ లైన్‌లోకి డైవర్టు కావడం అసాధ్యమని.. ఎవరో ఏదో గందరగోళం చేయబట్టే అలా జరిగి ఉంటుందని సందేహం వ్యక్తం చేశారు.
Also read : Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి
“ఒకవేళ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినా ఒక సిగ్నల్ కు బదులు ఇంకో సిగ్నల్ ను చూపించదు. ఒకవేళ అందులో సాంకేతిక సమస్యలు తలెత్తితే రెడ్ సిగ్నల్ ఇస్తుంది. ఆ ట్రాక్ లో రైళ్ల రాకపోకలు ఆగిపోతాయి. ఫలితంగా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉండదు. ఒడిశాలో రైలు ప్రమాదం జరిగిన చోట గూడ్స్ రైలు పార్క్ చేసి ఉన్న లూప్ లైన్‌లోకే .. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ కు కూడా గ్రీన్ సిగ్నల్ రావడం అనేది ముమ్మాటికీ సందేహించాల్సిన విషయమే” అని త్రివేది తెలిపారు. శుక్రవారం రాత్రి 7 గంటల తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు ట్రైన్స్ ఒకదాన్నొకటి ఢీకొనడంలో భయంకరమైన కుట్ర కోణం ఉందేమో అనిపిస్తోందన్నారు. ” పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. లెక్కలు వేసుకొని కుట్ర చేయడం వల్లే ఇలా కొన్ని సెకన్ల వ్యవధిలో ట్రైన్స్ వచ్చి ఒకదాన్నొకటి ఢీకొని భారీ ప్రాణ నష్టం జరిగింది” అని ఆయన ఆరోపించారు.
Also read : Virender Sehwag: సెల్యూట్ సెహ్వాగ్, ఒడిశా ప్రమాదంలో అనాథైన పిల్లలకు ఉచిత విద్య!
ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టం ను టాంపరింగ్ చేయబట్టే..
” సిగ్నల్ ఫెయిల్యూర్ అనో.. రైలు(కోరమాండల్ ఎక్స్‌ప్రెస్) పట్టాలు తప్పిందనో చెప్పలేం.. లూప్ లైన్ లో హెవీ ఇనుప ఖనిజం లోడ్ తో నిలబడి ఉన్న గూడ్స్ ట్రైన్ ను ప్రయాణికులతో కూడిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది అనేది విస్పష్టం” అని దినేష్ త్రివేది చెప్పారు. “తనకు ఇష్టం వచ్చిన ట్రాక్ లో ట్రైన్ ను నడిపే స్వేచ్ఛ ట్రైన్ డ్రైవర్లకు ఉండదు… వాళ్ళు జస్ట్ సిగ్నల్స్ ను ఫాలో అవుతుంటారు.. వాటికి అనుగుణంగా బ్రేక్స్ వేస్తారు.. ట్రైన్ స్పీడ్ ను పెంచడానికి యాక్సిలరేటర్ ఇస్తుంటారు.. ఆ మూడు ట్రైన్స్ లోపల ఏమీ జరగలేదు.. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టం ను ఎవరో లోపలి నుంచి టాంపరింగ్ చేయబట్టే ఈ భారీ ఉపద్రవం జరిగింది” అని త్రివేది ఆరోపణలు చేశారు.