2025లో భారత రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జగదీప్ ధన్కడ్ ( Dhankhar) అనుకోని విధంగా రాజీనామా చేయడం భారతీయ రాజ్యాంగ వ్యవస్థలో సంచలనం రేపింది. గత కొద్ది నెలలుగా ధన్కడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం పెంచుతూ, రాజ్యసభలో తన అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రయత్నించారు. ఇది అధికార పార్టీలో అసహనానికి దారి తీసింది.
రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్కడ్ ప్రభుత్వంతో సమన్వయాన్ని పెంచుకునే బదులు, చట్ట పుస్తకాలను ఆధారంగా చేసుకుని తన చైర్మన్ అధికారాలను హక్కుగా భావించారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి విపక్ష నేతలతో భేటీ కావడం, ప్రస్తుత ప్రజాస్వామ్య స్థితి గురించి విమర్శలు చేయడం అధికార బీజేపీకి మిగుడుపడలేదు. ముఖ్యంగా రైతుల ఆందోళనలపై ధన్కడ్ ప్రభుత్వ తీరును పబ్లిక్ వేదికపై తప్పుపడటంతో ప్రభుత్వం ఆశ్చర్యానికి గురైంది.
Wife Murder Husband : కట్టుకున్న పాపానికి మొగుళ్లను ఇంత దారుణంగా హత్యలు చేస్తారా..?
“సర్వోన్నతమైనది పార్లమెంట్” అన్న ధన్కడ్ వ్యాఖ్యలు ప్రభుత్వం రూపొందించిన న్యాయవ్యవస్థను ప్రభావితం చేసే పథకాలకు భంగం కలిగించాయి. విపక్షం ఉపరాష్ట్రపతిపై నో-కాన్ఫిడెన్స్ ప్రతిపాదనకు గట్టిగా ప్రయత్నించడంతో ధన్కడ్ వైఖరిలో మార్పు వచ్చిందని బీజేపీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆయన నిర్ణయాలు ప్రభుత్వానికి అసౌకర్యంగా మారాయి. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై విచారణ ప్రక్రియ ప్రారంభించేందుకు ధన్కడ్ అనుమతి ఇవ్వడం బీజేపీకి తీవ్రమైన షాక్ ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా ధన్కడ్ రాజ్యసభలో ప్రభుత్వాన్ని ఓడించారు. ఇంతటి చారిత్రక విచారణను పూర్తిగా తన ఆధీనంలో ఉంచాలన్న ఉద్దేశంతో ధన్కడ్ వ్యవహరించారని విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో ప్రభుత్వంపై విశ్వాస లోపం మరింత గాఢమైంది.
ధన్కడ్ రాజీనామా చేయడం ద్వారా బీజేపీ తన రాజకీయ నష్టాలను తగ్గించుకుంది. మూడవ సారిగా అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం స్థిరంగా ఉందనే మానసిక చిత్తాన్ని ప్రజల్లో నిలబెట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారింది. ధన్కడ్ RSS కు సన్నిహితుడైనప్పటికీ, మోదీ – షా స్టైల్‌ను సమర్థవంతంగా అర్థం చేసుకోలేకపోయారు. ధన్కడ్ వ్యక్తిగతంగా ప్రభుత్వాన్ని బహిరంగంగా వ్యతిరేకించే స్థాయికి వెళ్లే అవకాశం తక్కువే అయినప్పటికీ, ఆయన రాజీనామా బీజేపీ పాలనపై ప్రశ్నలు తలెత్తించడంలో మాత్రం అనివార్యంగా మారింది.