Dhananjay Munde : సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ హత్య కేసు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే రాజీనామా చేశారు. ఈ హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేయాలని ధనంజయ్ ముండేను సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలో ధనంజయ్ నేడు రాజీనామా చేశారు. అనంతరం ఆ రాజీనామా పత్రాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు పంపినట్లు మీడియాకు తెలిపారు.
Read Also: Vidadala Rajini : విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు..?
కాగా, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. దేశ్‌ముఖ్ హత్య కేసులో సిఐడి చార్జిషీట్ పరిణామాలను, కరాడ్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఘటనలపై చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సోమవారం రాత్రి ఫడ్నవీస్‌ను కలిసినట్లు సమాచారం. ధనంజయ్ ముండేను ఈరోజే మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఫడ్నవీస్ కోరినట్లు తెలుస్తోంది. ఇక, దేశ్‌ముఖ్ హత్యకు సంబంధించిన దోపిడీ కేసులో ఆయన సన్నిహితుడు వాల్మిక్ కరాడ్ అరెస్టు కారణంగా ముండే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ధనంజయ్ ముండే ఈరోజు రాజీనామా చేయకపోతే, సభ కార్యకలాపాలను అడ్డుకుంటామని ప్రతిపక్షం ప్రకటించింది.
ఇక, డిసెంబర్ 9న కొందరు దుండగులు బీడ్ సర్సంచ్ సంతోష్ దేశ్‌ముఖ్‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఈ హత్య స్థానిక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఈ హత్య కేసులో మంత్రి ధనంజయ్ ముండే సహాయకుడు వాల్మిక్ కరాడ్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీడ్ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితుడిని మంత్రికి అత్యంత సన్నిహితుడైన బాలాజీ తండాలే కలవడం చర్చకు దారితీసింది. ఈ ఘటన రాజకీయంగానూ వేడి పుట్టించింది. ఈ క్రమంలో ధనంజయ్‌పై ప్రతిపక్షాలతో పాటు పలువురు మహాయుతి నేతలు సైతం విమర్శలు చేస్తున్నారు.
Read Also: Powerful Sister: అమెరికా కాచుకో.. ఎంతకైనా తెగిస్తాం.. కిమ్ సోదరి వార్నింగ్