Delhi Smog: ఢిల్లీలో పాక్షిక లాక్ డౌన్, సంపూర్ణ లాక్ డౌన్ దిశగా అడుగులు

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరుగుతోంది.

  • Written By:
  • Publish Date - November 14, 2021 / 12:14 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే ఢిల్లీ నగరంతోపాటు చుట్టుపక్కల కూడా కాలుష్యంతో విషపూర్తితమైందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఢిల్లీలో ప్రస్తుతమున్న పరిస్థితిపై సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ స్పందించారు. రెండురోజులు లాక్‌డౌన్ ప్రకటించాలంటూ జస్టిస్ ఎన్వీ రమణ కేజ్రీవాల్ ప్రభుత్వానికి సూచించారు. దింతో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో లాక్‌డౌన్ తరహా పరిస్థితులను ప్రకటించారు. కఠిన ఆంక్షలను విధించారు. సోమవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.

ఎల్లుండి నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వారం రోజుల పాటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆన్‌లైన్, వర్చువల్ విధానంలో విద్యాబోధన కొనసాగుతుందని, పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు భౌతికంగా పాఠశాలలకు వెళ్లడాన్ని ఈ వారం రోజుల పాటు నిషేధించామని చెప్పారు.

Also Read: గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ

వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు అన్ని రకాల నిర్మాణ పనులను నిలిపివేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు. ఇక
ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని,ఇళ్ల నుంచే తమ విధులను నిర్వర్తించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రైవేటు కార్యాలయాలు కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించాలని వారి యాజమాన్యాలను ఆదేశిస్తామని చెప్పారు.

Also Read: ఇంగ్లీష్ పాండిత్యంపై సుప్రీమ్ సీజే సెటైర్

లాక్ డౌన్ ఎక్స్‌ట్రీమ్ స్టెప్ అవుతుందని, కానీ పరిస్థితులు అదుపులోకి రాకుంటే పూర్తిగా లాక్ డౌన్ పెడుతామని తెలిపిన కేజ్రీవాల్, ఢిల్లీ ప్రజలెవరూ అవసరం ఉంటె తప్పా బయటకి రావొద్దని సూచించారు.