Key Leaders Result: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ‘కమలం’ వికసించింది. ఉదయం 10.57 గంటల సమయానికి ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ 41 చోట్ల బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో దూసుకుపోతున్నారు. 29 చోట్ల ఆప్ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. 1 చోట కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో తాజా ఫలితాల సరళి ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం..
Also Read :Shock To Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. ఢిల్లీలో కమల వికాసం.. కారణాలివీ
వెనుకంజలో ఉన్న ఆప్ నేతలు
- ఆప్ నేత అమానతుల్లా ఖాన్ 1734 ఓట్లతో ఓఖ్లా అసెంబ్లీ స్థానంలో వెనుకంజలో(Key Leaders Result) ఉన్నారు.
- ఆప్ నేత మనీశ్ సిసోడియా జంగ్ పురా స్థానంలో 1314 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నేత తర్విందర్ సింగ్ మర్వా ఆధిక్యంలో ఉన్నారు.
- ఢిల్లీ సీఎం, ఆప్ నేత అతిషి కల్కాజీ స్థానంలో 1039 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి ఆధిక్యంలో ఉన్నారు.
- షకూర్ బస్తీ అసెంబ్లీ స్థానంలో ఆప్ నేత సత్యేందర్ జైన్ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కర్నైల్ సింగ్ 9,607 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
- గ్రేటర్ కైలాశ్ స్థానంలో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ 459 ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ ముందంజలో ఉన్నారు.
ముందంజలో ఉన్న ఆప్ నేతలు
- న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ప్రతీ ఓట్ల లెక్కింపు రౌండ్‌కు ఫలితం మారుతోంది. ఇక్కడ ప్రస్తుతానికి ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4,679 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ నుంచి కేజ్రీవాల్‌కు టఫ్ ఫైట్ ఎదురవుతోంది.
- రోహిణి అసెంబ్లీ స్థానంలో ఆప్ నేత ప్రదీప్ మిట్టల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజేందర్ గుప్తా వెనుకంజలో ఉన్నారు. అయితే ప్రతీ రౌండ్‌కు ఇక్కడ ఈ ఇద్దరు అభ్యర్థుల ఆధిక్యం మారుతోంది.
- చాందినీ చౌక్ అసెంబ్లీ స్థానంలో ఆప్ నేత పునర్ దీప్ సింగ్ సాహ్ని 11,584 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ నేత ముదిత్ అగర్వాల్ రెండో స్థానంలో ఉన్నారు.
- బల్లిమారన్ అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి ఇమ్రాన్ హుసేన్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం 1834 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. ఇక్కడ రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కమాల్ బాగ్రీ ఉన్నారు. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి హారూన్ యూసుఫ్ ఉన్నారు.