Shock To Old Vehicles: 15 ఏళ్లకు పైబడిన పాత వాహనాలను కలిగిన వారికి షాకిచ్చే విషయం. ఈ వాహనాలను నడిపే వారికి మార్చి 31 నుంచి పెట్రోలు బంకులు చుక్కలు చూపించనున్నాయి. ఎందుకంటే ఈ వాహనాలకు ఇక పెట్రోలు పోయరు. పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక గాడ్జెట్‌లు ఏర్పాటు చేసి మరీ 15 ఏళ్లు పైబడిన వాహనాలను గుర్తించనున్నారు. ఈమేరకు ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కాలుష్య కట్టడి చర్యల అమలులో భాగంగా 15 ఏళ్లకు పైబడిన వాహనాలకు చెక్ పెట్టనున్నారు.
Also Read :Gender Determination: కారులోనే లింగ నిర్ధారణ టెస్టులు.. ముఠా ఆటకట్టు
యాంటీ స్మోగ్ గన్లు
ఈ అంశంపై ఈరోజు (శనివారం) ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే పై నిర్ణయాలు తీసుకున్నారు. ఎత్తైన భవనాలు, హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో యాంటీ స్మోగ్ గన్లను అమరుస్తామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 90 శాతం సీఎన్‌జీ బస్సులను దశలవారీగా ఉపసంహరించుకొని, ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ఢిల్లీలోని నూతన బీజేపీ సర్కారు కేంద్ర ప్రభుత్వ తుక్కు విధానాన్ని అమలు చేయడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగా ఫిట్‌నెస్ లేని వాహనాలకు(Shock To Old Vehicles) స్వస్తి పలకనున్నారు. కాలుష్యాన్ని తగ్గించే దిశగా అన్ని చర్యలను అమలు చేయనున్నారు.
Also Read :Akash Ambani : ముకేశ్ అంబానీ గురించి ఆకాశ్ అంబానీ ఏం చెప్పారో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చే ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇందుకోసం జీడిమెట్ల సమీపంలోని పాశమైలారంలో మరో ప్లాంటుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే షాద్‌నగర్ సమీపంలోని కొత్తూరు, గజ్వేల్‌లలో ఒక్కో ప్లాంటు ఉన్నాయి. వ్యక్తిగత అవసరాలకు వినియోగించే వాహనాలు రిజిస్ట్రేషన్ తేదీ నుంచి 15 ఏళ్లు, వాణిజ్య వాహనాలు 8 ఏళ్లు దాటితే కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. ఆ వ్యవధి తీరిన వాహనాల నుంచి గ్రీన్ ట్యాక్స్‌ను వసూలు చేస్తారు. ఈ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు.