G20 Summit 2023: G20 సమ్మిట్.. విజయవంతం చేయాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రజలదే

సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది, ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు.

Published By: HashtagU Telugu Desk
G20 Summit

New Web Story Copy (98)

G20 Summit 2023: సెప్టెంబరు 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది, ఈ సదస్సుకు ప్రపంచ దేశాల అధ్యక్షులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వాసులు కాస్త అసౌకర్యానికి గురయ్యే అవకాశముంది. జి 20కి సదస్సు నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీనితో పాటు అతిథి దేవో భవ విషయంపై కూడా ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.ఈ సదస్సును విజయవంతం చేయాల్సిన బాధ్యత ఢిల్లీ ప్రజలపై ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ప్రతిష్టను దిగజార్చవద్దని ప్రధాని అన్నారు. దేశ పతాకాన్ని రెపరెపలాడించి, గౌరవాన్ని కాపాడుకునే అవకాశం ఢిల్లీ ప్రజలకు ఉందన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలతో సమావేశమైన అనంతరం జీ20 సదస్సుపై ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని. ఢిల్లీ ప్రజలను అసౌకర్యానికి గురి చేస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని మోడీ అన్నారు.

జీ20 సదస్సు కారణంగా ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. అతిథులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సమిట్ జరిగే ప్రదేశంలో పౌరులకు అనుమతి ఉండదు. ఈ రెండ్రోజులు ప్రజలు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించాలి. దేశ రాజధానిలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూసివేస్తారు. G20 సమ్మిట్ దృష్ట్యా సుప్రీంకోర్టును మూసివేస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం ఒక సర్క్యులర్ జారీ చేసింది. వాస్తవానికి, జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న ప్రగతి మైదాన్‌లో కొత్తగా ప్రారంభించిన ఐటీపీఓ కాంప్లెక్స్ సుప్రీంకోర్టు భవనానికి ఆనుకుని ఉంది.

Also Read: VVS Laxman: ఆసియా గేమ్స్ లో పాల్గొనే భారత జట్టుకు కోచ్ గా వివిఎస్ లక్ష్మణ్

  Last Updated: 27 Aug 2023, 10:55 AM IST