Rs 30000 Fine : మన దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా తగ్గిపోతోంది. ఏటా చలికాలంలోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. ఢిల్లీ మహా నగరం చుట్టూ ఉండే పొలాల్లో పంట వ్యర్థాలు, వరి దుబ్బులను రైతులు కాలుస్తుంటారు. వాటి నుంచి వాతావరణంలోకి వెలువడే పొగ కూడా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని((Rs 30000 Fine) పెంచుతోందని పరిశీలకులు గుర్తించారు. ఈనేపథ్యంలో నిర్లక్ష్యంతో వరి దుబ్బులు, పంట వ్యర్థాలను కాల్చే రైతులపై రూ.30వేల దాకా భారీ జరిమానాలను విధిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తక్షణం ఈ జరిమానాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో గాలి నాణ్యతను పెంచే సదుద్దేశంతోనే ఈ చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది.
Also Read :Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?
- కొత్త నిబంధనల ప్రకారం 2 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలను దహనం చేస్తే రూ.5 వేల దాకా జరిమానా కట్టాల్సి ఉంటుంది.
- 2 నుంచి 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలను దహనం చేస్తే రూ.10 వేల దాకా జరిమానా కట్టాల్సి ఉంటుంది.
- 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు పంట వ్యర్థాలను దహనం చేస్తే రూ.30 వేల దాకా జరిమానా కట్టాల్సి ఉంటుంది.
- ‘ది కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ చట్టం-2021’లో భాగంగా ఈ జరిమానాలను రైతులపై విధిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Also Read :Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్ 370’ బ్యానర్‌పై రగడ
వాస్తవానికి గత నెలాఖరులో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఢిల్లీలో కాలుష్యం కట్టడి కఠినమైన చర్యలేవీ తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో పదును లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఒకవేళ కొన్ని చట్టాలు చేసినా.. వాటి అమలుకు అధికారులను నియమించడం లేదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఈసందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భాటి వాదన వినిపిస్తూ.. తప్పకుండా పర్యావరణ చట్టాల్లో జరిమానాలను బలంగా అమలుచేస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే ఢిల్లీ చుట్టూ ఉన్న పొలాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులపై భారీ జరిమానాలను విధించేందుకు రంగం సిద్ధం చేశారు. వాస్తవానికి పరిశ్రమలు, వాహన కాలుష్యం వల్లే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ప్రబలుతోంది.