Site icon HashtagU Telugu

Delhi Liquor Case : సీఎం కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

Arvind Kejriwal Claims Cop Who Manhandled AAP Leader Misbehaved With Him

Arvind Kejriwal Claims Cop Who Manhandled AAP Leader Misbehaved With Him

సీఎం కేజ్రీవాల్‌ (CM Kejriwal)కు మరో బిగ్ షాక్ తగిలింది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయస్థానం తిరస్కరించింది. హోలీ పండుగ కారణంగా సోమ, మంగళవారాల్లో కోర్టుకు సెలవు ఉన్నందున మార్చి 27వ తేదీ బుధవారమే కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో మరోసారి కేజ్రీవాల్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది.

We’re now on WhatsApp. Click to Join.

ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case)లో తన అరెస్ట్ అక్రమంటూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) మెట్లు ఎక్కారు. ఈడీ అరెస్ట్, కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్, రిమాండ్ ఉత్తర్వులను కొట్టేసి.. తనను వెంటనే విడుదల చేయాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే, సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. విచారణ కోసం బుధవారం ఆగాలని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ క్రమంలో తన అరెస్ట్, కస్టడీని కొట్టేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఢిల్లీ కోర్ట్ షాక్ ఇచ్చింది.

ఇదిలా ఉంటె కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలని అందులో పేర్కొంది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. జర్మనీ చర్య తమ దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని పేర్కొంది. కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం జర్మనీ ప్రకటనను సమర్థించింది.

Read Also : CM Revanth Reddy: కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ నేతలు చేరుతుండడం ఫై VH అసంతృప్తి