Site icon HashtagU Telugu

Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట

delhi-high-court-rejects-plea-seeking-removal-of-arvind-kejriwal-from-cm-post

delhi-high-court-rejects-plea-seeking-removal-of-arvind-kejriwal-from-cm-post

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు౯Delhi High Court) లో ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో అరెస్టయిన కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైన సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన సూర్జిత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఈ పిల్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు నేడు తిరస్కరించింది.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు ఈ పిల్ నేడు విచారణకు వచ్చింది. అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడు అనేందుకు పిటిషనర్ తగిన ప్రామాణిక అంశాలను చూపించలేకపోయారని ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయపడింది.

We’re now on WhatsApp. Click to Join.

“కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రిని తొలగించాలంటున్నారు… ఆ నిబంధన ఎక్కడుందో చూపించండి. మీరు చెబుతున్న న్యాయపరమైన కొలమానం మాకు చూపించండి” అంటూ పిటిషనర్ ను ధర్మాసనం కాస్త గట్టిగానే ప్రశ్నించింది. అంతేకాదు, కేసు దర్యాప్తు ఈ దశలో ఉన్నప్పుడు న్యాయస్థానాల జోక్యానికి అవకాశమే లేదని స్పష్టం చేసింది.

Read Also: Taj Mahal: తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలి.. కోర్టులో పిటిషన్‌