Lok Sabha elections: ప్రధాని మోడీ(PM Modi) లోక్‌సభ ఎన్నికల్లో మతపరమైన విభజన ప్రసంగాలు(Religious divisive speeches) చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘీంచారని, ఆయనపై చర్యలకు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్(petitions)ను ఢిల్లీ హైకోర్టు(High Court of Delhi) సోమవారం రోజు తోసిపుచ్చింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదని, విచారణకు అర్హమైనది కాదని జస్టిస్ సచిన్ దత్తా తీర్పునిచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
పిటిషనర్లు చేసిన ఫిర్యాదును చట్టానికి అనుగుణంగా స్వతంత్రంగా అంచనా వేసి చర్య తీసుకునే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉండదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్‌లో ఎలాంటి మెరిట్ లేదనందున తోసిపుచ్చుతున్నట్టు పేర్కొంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్టు ముందుగానే పిటిషనర్ ఒక నిర్ణయానికి రావడం పూర్తిగా అనుచితమని కూడా కోర్టు తెలిపింది.
Read Also: Kharge Vs Modi : మోడీ సర్కారుతో రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి ముప్పు : ఖర్గే
కాగా, ప్రధాన మంత్రి, ఇతర బీజేపీ నేతల విద్వేష ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్లు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బన్స్వారాలో ఈనెల 21న ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని వారు ప్రస్తావించారు. షహీన్ అబ్దుల్లా, అమితబ్ పాండే, దేబ్ ముఖర్జీ అనే ముగ్గురు హైకోర్టులో ఈ పిటిషన్ వేశారు. విద్వేష ప్రసంగాలు చేసిన రాజకీయ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదుతో సహా తక్షణ చర్యలు తీసుకునేలా ఈసీఐని ఆదేశించాలని కోర్టును వారు కోరారు.