Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 05:56 PM IST

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) రిజర్వ్(Reserve)చేసింది. ఢిల్లీ మద్యం కేసులోని మనీలాండరింగ్ అంశంలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. అయితే తన అరెస్ట్‌ను ఆయన ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

ఈ పిటిషన్‌పై జస్టిస్ స్వరణకాంత శర్మ వాదనలు వాదనలు విన్నారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వోకేట్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రచారాన్ని అడ్డుకునే ఉద్దేశ్యంతో ఈ అరెస్ట్ జరిగిందని కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఈడీ ఆధారాలు చూపలేకపోయిందని కోర్టుకు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.

ఈడీ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కుంభకోణం జరిగిందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌గా, వ్యక్తిగతంగా ఆయన పాత్ర ఉందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.

ఎన్నికల వేళ కేజ్రీవాల్ అరెస్ట్ సరికాదని  అభిషేక్ మను సింఘ్వి అన్నారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేని పరిస్థితి నెలకొందని సింఘ్వి చెప్పారు. ఎన్నికలకు ముందే పార్టీని కూల్చివేయడానికి ప్రయత్నం జరుగుతోందని అన్నారు. గత ఏడాది అక్టోబర్ 30 నుంచి ఈ ఏడాది మార్చి 16 వరకు 9 సార్లు కేజ్రీవాల్ కి నోటీసులు ఇచ్చారని చెప్పారు.

Read Also: Mehbooba Mufti : ఇండియా కూటమికి షాక్.. కశ్మీర్‌లో ఒంటరిగా బరిలోకి పీడీపీ!

పీఎంఎల్ఏ సెక్షన్ 50 ప్రకారం కేజ్రీవాల్ స్టేట్ మెంట్ రికార్డు చేయలేదని అభ్యంతరాలు సింఘ్వి తెలిపారు. ఈడీ విచారణకు హాజరుకాలేదని కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారని అన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయన అరెస్ట్ మ్యాచ్ ఫిక్స్ లాంటిదని తెలిపారు. వాంగ్మూలం ఆధారంగా అరెస్ట్ చేయడం పనికిరాని చర్యని చెప్పారు.

మాగుంట రాఘవ, శరత్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసులురెడ్డి మొదట కేజ్రీవాల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని సింఘ్వి తెలిపారు. రెండో దశలో కొందరిని అరెస్టు చేశారని చెప్పారు. మూడో దశలో నిందితులు మొదటిసారి వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చారని తెలిపారు.

Read Also: BJP : బిజెపి లో చేరితే కేసులు లేనట్లేనా..?

నాలుగో దశలో ఆయనకు వ్యతిరేకంగా వాంగ్మూలాలు ఇచ్చిన వారికి ఎలాంటి అభ్యంతరం లేకుండా బెయిల్ ఇచ్చారని సింఘ్వి చెప్పారు. ఆ తర్వాత అప్రూవర్లుగా మారారని తెలిపారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారని చెప్పారు. ఈడీ పూర్తిగా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని తెలిపారు.

ఈడీ న్యాయబద్ధంగా వ్యవహరించలేదని సింఘ్వి చెప్పారు. బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేయలేదని, అయితే ఆయన స్టేట్ మెంట్ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. సి.అరవింద్ ఇచ్చిన స్టేట్ మెంట్ షాక్ కు గురిచేస్తోందని చెప్పారు. ఈడీ పీఎంఎల్ఏ సెక్షన్ 50ని ప్రాతిపదికగా తీసుకుంటుందని, అయితే, రెండేళ్లుగా ఏమీ కనుగొనలేదని తెలిపారు.

Read Also:DJ Tillu 2 : ఎన్టీఆర్ ఇంట్లో టిల్లు 2 సక్సెస్ సంబరాలు