Delhi Excise Policy: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో రిమాండ్ లో ఉన్న ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. రెండేళ్లపాటు జైలు జీవితం అనుభవించిన మనీష్ సిసోడియాకు ఇటీవలే బెయిల్ వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ కవిత, తాజాగా ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బయటకు వచ్చారు. అయితే ఇదే కేసులో నిందితులుగా చేర్చబడిన చివరి ఇద్దరికీ కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వ్యాపారవేత్తలు అమిత్ అరోరా (amit arora) , అమన్‌దీప్ సింగ్ ధాల్‌లకు హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఇద్దరు నిందితులకు రిలీఫ్ మంజూరు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వివరాల ప్రకారం ఈ ఇద్దరు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ని సవరించేటప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు. లైసెన్స్ హోల్డర్‌లకు భారీగా లావాదేవీలు జరిపారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 17, 2021న ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది, అయితే అవినీతి ఆరోపణల తర్వాత సెప్టెంబర్ 2022 చివరిలో ఎక్సైజ్ పాలసీ(Excise Policy) ని రద్దు చేసింది. అరోరా గురుగ్రామ్‌కు చెందిన బడ్డీ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు నవంబర్ 29, 2022న మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. అప్పటి నుండి అతను జైలులో ఉన్నాడు. సిబిఐ వాదనల ప్రకారం అరోరా మనీష్ సిసోడియాకు సన్నిహితుడు ఇద్దరూ మద్యం లైసెన్స్‌దారుల నుండి సేకరించిన అక్రమ డబ్బును వేరే మార్గాల్లో వినిగించారన్న అభియోగాలు ఉన్నాయి.
Also Read: No Demolition: కూల్చివేతలపై సుప్రీం కీలక నిర్ణయం, హైడ్రాకు బ్రేకులు?