Site icon HashtagU Telugu

Fire Break : ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలువురు

Fire E Accident

Fire E Accident

Fire Break : దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ద్వారకలోని శబ్ద్ అపార్ట్‌మెంట్‌లో ఉదయం 10 గంటల సమయంలో ఆరో అంతస్తులో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా ఆంతస్తును మంటలు చుట్టుముట్టడంతో భయభ్రాంతులకు గురైన ముగ్గురు వ్యక్తులు కిందకు దూకారు. ఈ ఘటనలో వారు తీవ్రంగా గాయపడగా, వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే ఎనిమిది అగ్నిమాపక వాహనాలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. మంటలు ఇతర అంతస్తులకు కూడా వ్యాపిస్తున్నాయని, పొగ కారణంగా సహాయక చర్యలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని ఫైర్‌ అధికారులు తెలిపారు.

ఈ ప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగిన సమయంలో వినిపించిన ఆర్తనాదాలతో ఆ పరిసరాల్లో ఒక్కసారిగా అలజడి నెలకొంది. ప్రస్తుతం భవనంలో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారు.

Los Angeles: లాస్ ఏంజిల్స్‌లో నిప్పులు చిమ్ముతున్న వలస నిరసనలు