Site icon HashtagU Telugu

Sisodia : ఢిల్లీ లిక్కర్‌ స్కాం..మరోసారి సిసోడియాకు ఎదురుదెబ్బ

Delhi court rejects Manish Sisodia second bail plea in excise policy case

Delhi court rejects Manish Sisodia second bail plea in excise policy case

Manish Sisodia: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్‌ సిసోడియాకు ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు(Delhi liquor scam case)లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు తోసి పుచ్చింది. సిసోడియాకు బెయిల్(Bail) ఇవ్వడానికి సీబీఐ స్పెషల్ కోర్టు నిరాకరించింది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సిసోడియా బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. సిసోడియా బెయిల్ పిటిషన్లపై ఈరోజు జడ్జిమెంట్ వెల్లడించింది. అంతేకాక ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో సిసోడియాకు బెయిల్ ఇవ్వొద్దని దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ కోర్టుకు విజ్ఞప్తి చేశాయి. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి నిరారించాయి.

Read Also:Pawan Kalyan : జగన్ కు పదవి గండం ఉందని ఆ మహా కుంభాభిషేకం చేయడం లేదు

మరోవైపు ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో తన బెయిల్‌ను తిరస్కరిస్తూ సిటీ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆప్ తెలిపింది.