Sonam Wangchuk : పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ , ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నిర్బంధంలో ఉన్న ఆయనను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ మేరకు ఆప్ వర్గాలు వెల్లడించాయి. వాంగ్‌చుక్ ప్రారంభించిన యాత్ర లద్దాఖ్ నుంచి ఢిల్లీకి చేరుకునే క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆయనను కలిసేందుకు సీఎం ఆతిశీ బవానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Read Also: CM Chandrababu : వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన: సీఎం చంద్రబాబు
కాగా.. సోనమ్ వాంగ్‌చుక్, ఇతర మద్దతుదారులు తమ డిమాండ్‌లను నెరవేర్చాలని గత నెల 1న లేహ్‌లో పాదయాత్ర ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌కు వారి పాదయాత్ర చేరుకున్నాక వాంగ్‌చుక్ తమ పాదయాత్ర ఉద్దేశాన్ని వెల్లడించారు. ఐదేళ్ల క్రితం కేంద్రం తమకిచ్చిన వాగ్దానాన్ని గుర్తుచేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టామన్నారు. ఇక, వారి డిమాండ్‌లలో ప్రధానమైనది లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్‌లో చేర్చడం. ఇది స్థానిక జనాభా, వారి భూమి, సాంస్కృతిక గుర్తింపును రక్షించేందుకు చట్టాన్ని రూపొందించే అధికారాన్ని ఇస్తుంది.
Read Also: Tirumala Laddu Issue : చంద్రబాబుపై సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చేయాల్సింది కాదు – పురందీశ్వరి
వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకోవడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ, రాజ్యాంగ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు వందల మంది లద్దాఖీలను నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ క్రమంలోనే ఆయనను కలిసేందుకు వెళ్లిన ఆతిశీని అడ్డుకున్నారు.
కాగా, ” ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్ వాంగ్‌చుక్‌ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు” అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.
Read Also: International Coffee Day : మీకు కాఫీ ప్రేమకులైతే ఖచ్చితంగా భారతదేశంలోని ఈ 5 ప్రదేశాలను సందర్శించండి..!